Ads
ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఈ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని, అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు అని అందరూ అన్నారు. కానీ సినిమాకి సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా మెల్లగా ఒకొక్కటి చూసిన తర్వాత ఇది “అసలు తెలుగు సినిమానేనా?” అని అనుమానం కూడా వచ్చింది.
సినిమాపై నెగిటివ్ టాక్ వస్తోంది. సినిమాలో కొన్ని సీన్స్ అయితే అసలు రియాలిటీకి ఏ మాత్రం దగ్గర లేవు అని అంటున్నారు. అందులో రెండు సీన్స్ మీద మాత్రం విపరీతంగా కామెంట్ చేస్తున్నారు. అందులో ఒక మదర్ సెంటిమెంట్ సీన్ ఉంది. ఆ సీన్ అయిపోయిన వెంటనే పాట వస్తుంది. ఆ పాట కూడా హీరో హీరోయిన్ మధ్యలో వచ్చే ఒక ఫాస్ట్ బీట్ పాట. అసలు అలాంటి సీన్ తర్వాత ఆ పాట రావడం ఏంటి అని కామెంట్ చేస్తున్నారు.
అలాగే హీరో బాక్సింగ్ కాంపిటీషన్ కోసం లాస్ వేగాస్ కి వెళ్తాడు. అక్కడ తన అవతల వ్యక్తి కొట్టిన దెబ్బకి హీరో పడిపోతాడు. హీరో తల్లి టీవీలో ముంబైలో ఇదంతా చూస్తూ ఉంటుంది. లే అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ముంబైలో హీరో తల్లి అరిస్తే లాస్ వేగాస్ లో ఉన్న హీరోకి ఇది వినిపించి లేచి ఫైట్ చేస్తాడు. ఇదంతా చూస్తూ ఉంటే ఎప్పుడో పాత సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఉన్నాయి అని మనకి అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఈ రెండు సీన్స్ పై సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తున్నాయి.
End of Article