“లైగర్” సినిమా OTT లోకి వచ్చేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుందంటే..?

“లైగర్” సినిమా OTT లోకి వచ్చేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుందంటే..?

by Mohana Priya

Ads

Liger Movie OTT: ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఈ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని, అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు అని అందరూ అన్నారు.

Liger Movie OTT Release Date, Platform:

కానీ సినిమాకి సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా మెల్లగా ఒకొక్కటి చూసిన తర్వాత ఇది “అసలు తెలుగు సినిమానేనా?” అని అనుమానం కూడా వచ్చింది. సినిమా బృందం సినిమా విడుదల అయ్యే ముందు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా కోవిడ్ సమయంలో రూపొందింది. దాంతో ఆ సమయంలో సినిమా ఓటీటీ లోకి అమ్మడానికి చాలా ఆఫర్స్ వచ్చాయని చెప్పారు. సినిమాకి ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ 200 కోట్లు ఆఫర్ చేస్తే సినిమా బృందం రిజెక్ట్ చేశారు.

Liger Movie OTT platform

liger movie review

అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా విడుదల అయిన 10 వారాల తర్వాత ఓటీటీ లోకి విడుదల అవుతుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాని విడుదలకు ముందే ఒక పెద్ద ఓటీటీ సంస్థ రైట్స్ కొనుగోలు చేసింది. ఈ సినిమాని డిస్నీ + హాట్‌స్టార్ సంస్థ కొనుగోలు చేసినట్టు సమాచారం. కేవలం తెలుగు సినిమానేనా లేదా మిగిలిన భాషల హక్కులను కూడా తీసుకున్నారా అనేది తెలియదు. ప్రస్తుతం అయితే ఈ సినిమా ఇంకా థియేటర్లలో నడుస్తోంది.


End of Article

You may also like