Ads
- చిత్రం : కోబ్రా
- నటీనటులు : విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్.
- నిర్మాత : S. S. లలిత్ కుమార్
- దర్శకత్వం : ఆర్. అజయ్ జ్ఞానముత్తు
- సంగీతం : ఏ ఆర్ రెహమాన్
- విడుదల తేదీ : ఆగస్ట్ 31, 2022
Video Advertisement
స్టోరీ :
సినిమా మొత్తం ఒక మ్యాథ్స్ టీచర్ (విక్రమ్) చుట్టూ తిరుగుతుంది. ఆయన కొన్ని హత్యకి కారణం అంటూ విక్రమ్ మీద ఆరోపణలు చేస్తారు. అసలు నిజంగా ఆ హత్యలు అన్ని విక్రమ్ చేశారా? నిజంగానే విక్రమ్ టీచర్ ఉద్యోగం మాత్రమే చేస్తున్నారా? ఆయన ప్రేమ కథ ఏంటి? ఈ హత్యల వెనకాల నిజంగా ఉన్నది ఎవరు? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
విక్రమ్ అంటే తమిళ్ స్టార్ హీరో అయినా కూడా తెలుగులో కూడా చాలా పాపులారిటీ ఉంది. విక్రమ్ నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులో విడుదల అవుతాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక థ్రిల్లర్ సినిమా అని అర్ధమైపోతుంది. సినిమా మొత్తం అలాగే సాగుతుంది. సినిమా సబ్జెక్ట్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉన్నా కూడా కొన్నిచోట్ల సాగదీసినట్లు అనిపిస్తుంది. అసలు సినిమాకి లవ్ ట్రాక్ అవసరం కూడా లేదు. ఏదో ఒక సినిమాకి కచ్చితంగా ఒక లవ్ స్టోరీ ఉండాలి అన్నట్టు ఇది కూడా పెట్టారు ఏమో అనిపిస్తుంది.
సినిమా చాలా చోట్ల అర్థం కాదు. స్క్రీన్ ప్లే అంత కాంప్లెక్స్ గా ఉండడం వల్ల కొన్ని సీన్స్ జనాలకి అర్థం అవ్వడానికి టైం పడుతుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించారు విక్రమ్. ఇర్ఫాన్ పఠాన్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. తర్వాత నెగిటివ్ పాత్రలో నటించిన మలయాళం నటుడు రోషన్ మ్యాథ్యూ నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు కూడా సినిమాకి హైలైట్ గా నిలిచాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
- విక్రమ్
- యాక్షన్ సీన్స్
- సినిమా సబ్జెక్ట్
- లొకేషన్స్
- పాటలు
మైనస్ పాయింట్స్:
- సాగదీసినట్లు అనిపించే కొన్ని సీన్స్
- చాలాచోట్ల అర్థంకాని స్క్రీన్ ప్లే
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
కొత్త కథ ఉన్న సినిమా చూద్దాం అనుకునేవారికి, అలాగే థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారికి కోబ్రా సినిమా కచ్చితంగా చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
End of Article