Ads
చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఈ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని, అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు అని అందరూ అన్నారు.
కానీ సినిమాకి సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా మెల్లగా ఒకొక్కటి చూసిన తర్వాత ఇది “అసలు తెలుగు సినిమానేనా?” అని అనుమానం కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో చాలా విషయాలు ప్రేక్షకులకి చెప్పలేదు. సినిమాలో చాలా విషయాలు ప్రశ్నలుగానే ఉండిపోయాయి. సినిమా క్లైమాక్స్ కూడా పూర్తిగా చూపించలేదు. అసలు ఈ సినిమాకి మొదట అనుకున్న హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్య పాండే కాదు.
ఈ సినిమాకి మొదట హీరో హీరోయిన్లుగా సూపర్ స్టార్ మహేష్ బాబు న, అలాగే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ని అనుకున్నారు. మహేష్ బాబు క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ సినిమా రిజెక్ట్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి. అలాగే నటి జాన్వీ కపూర్ కూడా డేట్స్ లేక ఈ సినిమా చేయలేకపోయారు. హీరోయిన్ పాత్రలో మొదటగా ఆలియా భట్ ని కూడా అనుకున్నారు. ఆలియా భట్ తనకి విజయ్ దేవరకొండతో సినిమా చేయడం ఇష్టమే కానీ, తన పాత్రకి పెద్దగా స్కోప్ లేదు అని రిజెక్ట్ చేశారు అనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అయితే ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది.
End of Article