Ads
- చిత్రం : రంగ రంగ వైభవంగా
- నటీనటులు : వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, సుబ్బరాజు.
- నిర్మాత : BVSN ప్రసాద్
- దర్శకత్వం : గిరీశాయ
- సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 2, 2022
Video Advertisement
స్టోరీ :
రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతిక శర్మ) చిన్నప్పటినుంచి ఒక స్కూల్ లో చదువుకుంటారు. ఒకరంటే ఒకరికి పడదు. పెద్దయ్యాక కూడా వారిద్దరూ ఒకటే మెడికల్ కాలేజీలో చేరుతారు. రాధ అన్నయ్య అర్జున్ (నవీన్ చంద్ర) కి రాజకీయాలు అంటే ఆసక్తి ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడని రిషి, రాధ తర్వాత ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలుపెడతారు. వారిద్దరూ కలిసారా? వారికి ఎదురైన సమస్యలు ఏంటి? వారి కుటుంబాలని ఎలా దగ్గర చేశారు? వారి ప్రేమ గెలిచిందా? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
మొదటి సినిమా ఉప్పెనతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు వైష్ణవ్ తేజ్. తర్వాత నటించిన కొండ పొలం సినిమా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇలాంటివి ఈ మధ్యకాలంలో తెలుగులో అయితే రాలేదు. కథలో పెద్ద కొత్తదనం ఏమీ లేదు. ఇలాంటి కథలు మనం చూస్తూనే ఉంటాం. ఫ్యామిలీ సినిమా కాబట్టి ఎమోషన్స్ హైలైట్ అయ్యేలా చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్ సినిమా మొత్తం బానే నటించినా కూడా ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఎమోషన్ సరిగ్గా తెరపై చూపించలేదు అనిపిస్తుంది.
కానీ మిగిలిన సినిమా మొత్తం నటనపరంగా చాలా ఇంప్రూవ్ అయ్యారు. హీరోయిన్ కేతిక శర్మ కూడా మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో నటన విషయంలో మెరుగుపడినట్టుగా అనిపించారు. నవీన్ చంద్ర, సుబ్బరాజు పాత్రలు బాగున్నా కూడా ఇంకా కొంచెం వివరంగా వారి గురించి చూపించి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కామెడీ కూడా చాలా చోట్ల వర్కౌట్ అయ్యింది. సహాయ పాత్రల్లో నటించిన నరేష్, ప్రభు వీళ్ళు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. కొన్ని పాటలు చిత్రీకరించిన విధానం కూడా బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
- హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ
- పాటలు
- నిర్మాణ విలువలు
- కామెడీ
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- కొన్నిచోట్ల బోరింగ్ గా అనిపించే సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
కథలో కొత్తదనం ఏమీ ఆశించకుండా, ఒక మంచి కుటుంబ కథ సినిమా చూడాలి అనుకునే వారికి రంగ రంగ వైభవంగా సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
End of Article