“జబర్దస్త్” లో పుష్పలా ఎంట్రీ ఇచ్చిన గీత ఎవరో తెలుసా..? ఇంతకీ ఆమెకు ఎంత పారితోషికం ఇస్తున్నారంటే?

“జబర్దస్త్” లో పుష్పలా ఎంట్రీ ఇచ్చిన గీత ఎవరో తెలుసా..? ఇంతకీ ఆమెకు ఎంత పారితోషికం ఇస్తున్నారంటే?

by Sainath Gopi

Ads

తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రజాధారణ పొందిన ప్రోగ్రాం ఏది అంటే ఇట్టే చెప్పేస్తారు ‘జబర్దస్త్’ అని ఎవరైనా. ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రతి ఇంట్లో టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు.”జబర్దస్త్” కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు లైఫ్ ఇచ్చింది. ఈ షో మొదలైన కొత్తల్లో ఆర్టిస్ట్స్ గా ఎక్కువగా జెంట్స్ మాత్రమే ఉండేవారు.

Video Advertisement

మగవారే ఆడవారిలా లేడీ గెటప్స్ ను వేసుకుని స్కిట్స్ లో పాల్గొని ఎంటర్టైన్ చేసేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఆడవాళ్లు కూడా స్కిట్స్ లో పాల్గొంటూ ఆర్టిస్టులుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

geethu 1

ఈ క్రమంలోనే సత్యశ్రీ, రోహిణి, సైమా, వర్ష లాంటి అమ్మాయిలు కూడా ఆర్టిస్ట్ లు గా ఎంట్రీలు ఇచ్చి తమదైన శైలిలో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నారు. అయితే.. ఈ జాబితాలో మరో కొత్త అమ్మాయి కూడా చేరింది. లేటెస్ట్ గా జబర్దస్త్ ఎపిసోడ్స్ లో కొత్తగా కనిపిస్తున్న అమ్మాయి గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందాం. ఆ అమ్మాయి పేరు గీతూ.

కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపిస్తూ ఉండే గీతూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. లేడీ కమెడియన్ అయిన గీతూ టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అంతే కాదు తన రాయలసీమ యాసతో ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకుంటూ తక్కువ టైం లోనే మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు చూడ చక్కని రూపంతో అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె చూడడానికి చిన్నగానే కనిపిస్తున్న పెళ్లి అయ్యి చాలా రోజులే అయ్యిందట.

యూట్యూబ్ వీడియోస్ తో కూడా పాపులర్ అయిన గీతూ బిగ్ బాస్ షోలకు చెప్పిన రివ్యూస్ తో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తరువాత ఆమెకు జబర్దస్త్ లో కూడా అవకాశం రావడంతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటోంది. అలాగే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మెప్పించింది గీతూ. ప్రస్తుతం ఆమె ఒక్కో కాల్షీట్ కు యాభై నుంచి డెబ్భై వేల వరకు పారితోషికం తీసుకుంటోందట. సీరియల్స్ లో కూడా అవకాశం వస్తే నటించాలని ఇంట్రస్ట్ చూపిస్తోందట. ఇటీవల జబర్దస్త్ లో పుష్ప స్కిట్ వేసి అదరగొట్టేసింది.


End of Article

You may also like