తండ్రి కూతురు ఒకే హాస్పిటల్ లో… మోనిత ప్లాన్ “వంటలక్క” కి కలిసొచ్చేలా ఉందిగా..?

తండ్రి కూతురు ఒకే హాస్పిటల్ లో… మోనిత ప్లాన్ “వంటలక్క” కి కలిసొచ్చేలా ఉందిగా..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో నడుస్తోంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో దీప ఇచ్చిన టిఫిన్ తిని మోనిత వాంతులు అయినట్టు నటిస్తుంది. ఈ విషయం దీపకి అర్థమవుతుంది. మరోపక్క కార్తీక్ టెన్షన్ పడుతూ డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. డాక్టర్ వచ్చి దీపకి, “మీకు చాలా పనులు ఉంటాయి మీరు వెళ్ళండి” అని చెప్తాడు.

Video Advertisement

తర్వాత మోనితని ఆస్పత్రిలో చేరుస్తారు. మరొకవైపు వారణాసి సౌర్య అదే ఆసుపత్రి ముందు ఆటో దిగుతారు. పార్సిల్స్ ని మోసుకుంటూ లోపలికి వెళుతూ ఉంటారు. ఇంకొక వైపు కార్తీక్ ఉంటే మరొక వైపు వీరు ఉంటారు. డాక్టర్ మౌనితకి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు నటిస్తూ ఉంటే తర్వాత, “వెళ్లి కార్తీక్ ని పిలిచి నేను చెప్పినట్టు చెప్పు” అని మోనిత చెప్తుంది.

karthika deepam monitha plan to seperate karthik and deepa

తర్వాత మోనితకి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని తెలుస్తుంది. దాంతో కార్తీక్ కోపంతో దీప ఇంటికి వెళ్ళి దీపని తిడతాడు. దీప కార్తీక్ తో తాను ఏం చేయలేదు అని చెప్తూ ఉన్నా కూడా కార్తీక్ వినకుండా వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని దీప తనను కాపాడిన డాక్టర్ కి, డాక్టర్ తల్లికి చెప్తుంది. డాక్టర్ ఇదంతా విని కార్తీక్ కి గతం గుర్తులేదు, కొంత సమయం ముందు ఏం జరిగింది అనేది కూడా కార్తీక్ కి గుర్తులేదు. ఇప్పుడు నిన్ను తిట్టిన విషయం కూడా కార్తీక్ ఎలా గుర్తు పెట్టుకుంటాడు అని చెప్తాడు. ఆ తర్వాత సౌర్య ఇంటికి వెళ్ళాక వారణాసితో తల్లిదండ్రుల గురించి చెప్పి బాధ పడుతుంది. తర్వాత ఏమవుతుంది అనేది ఇవాల్టి ఎపిసోడ్ లో తెలుస్తుంది.


End of Article

You may also like