Ads
ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా ఎప్పుడో మొదలయ్యింది. కానీ చాలా కారణాల వల్ల షూటింగ్ అలస్యమైంది. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది. చోళుల కాలానికి చెందిన విషయాల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.
Video Advertisement
ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ హీరోలుగా నటిస్తున్నారు. త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా మలయాళ నటుడు జయరామ్, ప్రకాష్ రాజ్, విక్రమ్ ప్రభు, పార్తిబన్, కిషోర్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నిన్న విడుదల అయిన ట్రైలర్ లో వీరందరూ కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా కథ మణిరత్నం ఇప్పుడు అనుకున్నది కాదు. చాలా సంవత్సరాల నుండి మణిరత్నం ఈ సినిమా తీయాలి అని అనుకుంటున్నారు. అందుకోసం అప్పుడు సినిమాలో నటించే వారిని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు నటిస్తున్న నటులు, అప్పుడు సినిమా కోసం అనుకున్న నటులు వీరు కాదు. అప్పుడు పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం ఒక ప్రముఖ తెలుగు స్టార్ హీరోని కూడా అనుకున్నారు. ఈ సినిమా కోసం హీరోలుగా తమిళ్ స్టార్ హీరో విజయ్ తో పాటు, మరొక తెలుగు హీరోని కూడా అనుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో నటించాల్సి ఉంది.
ఈ విషయాన్ని అప్పుడు మహేష్ బాబు ట్విట్టర్ లో కూడా చెప్పారు. దాదాపు పది సంవత్సరాల క్రితం మహేష్ బాబు ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. మహేష్ బాబు మాట్లాడుతూ, “నా కల చివరికి నిజమయింది. నేను ఒక మణిరత్నం సినిమాలో నటిస్తున్నాను. నా జీవితంలో సంతోషకరమైన రోజుల్లో ఇది ఒకటి” అని రాశారు. సినిమా పేరు చెప్పలేదు కానీ అప్పుడు మహేష్ బాబు హీరోగా సినిమా ఇదే అని వార్తలు వచ్చాయి.
ఒకవేళ అప్పుడు నిజంగానే ఈ సినిమా జరిగి ఉంటే మహేష్ బాబు, విజయ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా అయ్యేదేమో. కానీ చాలా కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు వీరితో ఈ సినిమాని రూపొందించారు. అంతే కాకుండా ఇందులో త్రిష పాత్రకి ముందుగా కీర్తి సురేష్ ని సంప్రదించారు. కీర్తి సురేష్ అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయలేకపోయారు. దాంతో త్రిష ఈ సినిమా చేస్తున్నారు. ఒకవేళ మహేష్ బాబు అప్పుడే ఈ సినిమా చేసి ఉంటే పాన్ ఇండియన్ హీరో అప్పుడే అయ్యేవారు ఏమో అని చాలా మంది అంటున్నారు.
End of Article