Ads
శర్వానంద్ హీరోగా, రీతు వర్మ హీరోయిన్ గా వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో అమల అక్కినేని కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. వీరు మాత్రమే కాకుండా వెన్నెలకిషోర్, ప్రియదర్శి, నాజర్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. శ్రీ కార్తీక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
Video Advertisement
ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే చాలా గుర్తింపు పొందాయి. ఈ సినిమాలో ప్రముఖ స్టార్ హీరో కార్తీ కూడా ఒక పాట పాడారు. సినిమా టీజర్, ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది అమ్మ సెంటిమెంట్ సినిమా అని అర్థం అవుతోంది. అలాగే టైం ట్రావెల్ మీద కూడా సినిమా నడుస్తుంది అని అర్థం అవుతోంది. సినిమా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాకి సెన్సార్ బృందం క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు.
సినిమా విడుదలకి కొన్ని రోజుల ముందే ప్రీమియర్ షో కూడా ఏర్పాటు చేశారు. సినిమాలో నటించిన వారితో పాటు, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రీమియర్ షోకి హాజరు అయ్యి సినిమా ఎలా ఉంది అనేది చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ సినిమా చాలా ఎమోషనల్ గా ఉంది అని చెప్పారు. సెన్సార్ బృందం కూడా సినిమా చూశాక వారి రివ్యూలో ఇలాగే చెప్పింది అని సమాచారం. సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అని, కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది అని సోషల్ మీడియాలో అంటున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ గత కొంత కాలం నుండి వరుస హిట్ సినిమాలతో ముందుకు వెళుతోంది. అందులోనూ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలని తెలుగు ప్రజలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే హిట్ అవుతుంది అని, సినిమాలో వారు ఎంచుకున్న పాయింట్ అంత బాగుంది అని అంటున్నారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని అంటున్నారు. మరి ఈ రివ్యూలో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదల అయ్యే అంత వరకు ఆగాల్సిందే.
End of Article