Ads
- చిత్రం : ఒకే ఒక జీవితం
- నటీనటులు : శర్వానంద్, రీతు వర్మ, అమల అక్కినేని.
- నిర్మాత : S. R. ప్రకాష్‌బాబు, S. R. ప్రభు
- దర్శకత్వం : శ్రీ కార్తీక్
- సంగీతం : జేక్స్ బిజోయ్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 9, 2022
Video Advertisement
స్టోరీ :
సినిమా ముగ్గురు ప్రాణ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఆది (శర్వానంద్) ఒక మంచి గిటారిస్ట్ గా పేరు తెచ్చుకోవాలి అనుకుంటాడు. కానీ స్టేజ్ ఎక్కాలంటే భయం. చైతు (ప్రియదర్శి) ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు కానీ ఎవరూ నచ్చరు. శ్రీను (వెన్నెల కిషోర్) ఒక హౌస్ బ్రోకర్. కానీ శ్రీనుకి ఇంగ్లీష్ రాదు. ఆది చిన్నప్పుడు ఒక ప్రమాదంలో తన తల్లిని కోల్పోతాడు. అప్పటినుంచి భయపడుతూ ఉంటాడు. ఆదికి గర్ల్ ఫ్రెండ్ వైష్ణవి (రీతు వర్మ) ఎంతో ధైర్యం చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ ఆది మాత్రం భయపడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు స్నేహితుల జీవితాల్లోకి సైంటిస్ట్ రంగి కుట్టా పాల్ (నాజర్) వస్తాడు.
ఆయన దగ్గర ఉన్న టైం మిషన్ తో వారి ముగ్గురిని వారి చిన్నప్పటి టైంకి పంపుతాడు. అక్కడ వారు పిల్లలుగా ఉన్నప్పటి ఆది, చైతు, శ్రీను కూడా ఉంటారు. వాళ్ళు అప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుకుంటున్న క్రమంలో, చిన్నప్పటి ఆది, చైతు, శ్రీను అదే టైం మిషన్ సహాయంతో భవిష్యత్తులోకి వెళ్తారు. ఇలాంటి సమయంలో ఆ ముగ్గురు స్నేహితులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎవరి కాలాల్లోకి వాళ్ళు ఎలా వెళ్లిపోయారు? వారి తప్పులు సరిదిద్దుకున్నారా? ఆది భయం పోయిందా? చివరికి ఏం జరిగింది? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
టైం మిషన్, టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ మీద తెలుగులో అంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి. అవి అన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఒకే ఒక జీవితం సినిమా కూడా దాదాపు అలాంటి కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా. ఈ సినిమా ఒక ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. తల్లి కొడుకుల బంధం ఈ సినిమాలో హైలైట్ చేశారు. అమల, శర్వానంద్ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా అంతా మామూలుగా సాగుతున్న సమయంలో ఒక ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ క్రియేట్ చేశారు.
కేవలం తల్లి కొడుకుల సెంటిమెంట్ మాత్రమే కాకుండా అసలు మనిషి ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని చాలా బాగా చూపించారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శర్వానంద్ పాత్రకు తగ్గట్టుగా నటించారు. కమర్షియల్ పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర చేయడానికి ముందడుగు వేసిన శర్వానంద్ ని నిజంగానే అభినందించాలి. ప్రియదర్శి కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. వెన్నెల కిషోర్ పాత్ర సినిమాకి ఒక హైలైట్ గా నిలుస్తుంది. కామెడీ చాలా చోట్ల వర్కౌట్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ అమల అక్కినేని సినిమాలో నటించారు. అమల నటన సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. అలాగే రీతు వర్మ కూడా తన పాత్రకి తగ్గట్టుగా నటించారు.
పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి మరొక హైలైట్ అయ్యాయి. డైరెక్టర్ శ్రీ కార్తీక్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఈ సినిమాలో తాను అనుకున్న విషయాన్ని కూడా తెరపై చూపించడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు. కానీ సినిమా చాలా చోట్ల స్లోగా నడుస్తుంది. మెయిన్ పాయింట్ లోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ అందించిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- కాన్సెప్ట్
- ఎమోషన్స్
- మదర్ సెంటిమెంట్
- పాటలు
మైనస్ పాయింట్స్:
- స్లోగా నడిచే సీన్స్
- కొన్నిచోట్ల కొంచెం ల్యాగ్ అనిపించే ఎపిసోడ్స్
రేటింగ్ :
3.5/5
ట్యాగ్ లైన్ :
సినిమాలో ఎమోషన్స్ ని చూపించడంతో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఇటీవల కాలంలో వచ్చిన మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాల్లో ఒక సినిమాగా ఒకే ఒక జీవితం సినిమా నిలుస్తుంది.
End of Article