“కృష్ణం రాజు” గారి మరణంతో… “ప్రభాస్” అలాంటి నిర్ణయం తీసుకున్నారా..?

“కృష్ణం రాజు” గారి మరణంతో… “ప్రభాస్” అలాంటి నిర్ణయం తీసుకున్నారా..?

by Megha Varna

Ads

రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రౌద్ర రసం పండించాలన్నా.. భక్తుడిగా మెప్పించాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా.. ఆరు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి కృష్ణంరాజు అనారోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజుల క్రితం మృతి చెందారు.

Video Advertisement

కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గా చేసిన ఆయన, తర్వాత హీరో గా మెప్పించారు. ఆయన చివరి సారిగా ప్రభాస్ తో కలిసి ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటించారు. ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారిని ఆయన ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయన మరణించడంతో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టులను పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. మాములుగా అయితే ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాలు కొత్త షెడ్యూల్ షురూ అవ్వాల్సి వుంది.

కానీ కృష్ణంరాజు గారి మరణం తో ఈ సినిమా షూటింగ్ ఆగింది. కృష్ణంరాజు మరణించిన తరవాత షూటింగ్ స్టార్ట్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు కానీ ఇంకా వాయిదా వేశారు ప్రభాస్. పెద్దమ్మకు చెల్లెళ్లకు తోడుగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రభాస్. దీనితో వచ్చే నెల నుండి ప్రాజెక్ట్ కే, సలార్ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కానుంది.


End of Article

You may also like