Life Of Muthu Review : “శింబు” నటించిన లైఫ్ ఆఫ్ ముత్తు హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Life Of Muthu Review : “శింబు” నటించిన లైఫ్ ఆఫ్ ముత్తు హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : లైఫ్ ఆఫ్ ముత్తు
  • నటీనటులు : సిలంబరసన్ (శింబు), సిద్ధి ఇద్నానీ, రాధిక శరత్‌కుమార్.
  • నిర్మాత : ఈశారి కె. గణేష్
  • దర్శకత్వం : గౌతమ్ వాసుదేవ్ మీనన్
  • సంగీతం : ఏ ఆర్ రెహమాన్
  • విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2022

life of muthu movie review

Video Advertisement

స్టోరీ :

ముత్తు (శింబు) తన తల్లి (రాధిక శరత్‌కుమార్) తో కలిసి ముంబై నగరానికి వెళ్తాడు. అక్కడ వాళ్లిద్దరూ చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ముత్తు ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా చేరుతాడు. అంతా మామూలుగా వెళుతుంది అనే సమయంలో అక్కడ ఒక హత్యని చూస్తాడు. అప్పటి నుంచి ముత్తు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? గ్యాంగ్‌స్టర్‌ గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఒక సాధారణ వ్యక్తి నుండి ఒక గ్యాంగ్‌స్టర్‌ గా ఎలా మారాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

life of muthu movie review

రివ్యూ :

డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయకపోయినా కూడా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు శింబు. తమిళ్ హీరోలు అయినా కూడా తెలుగులో ఫేమస్ అయిన నటులలో శింబు ఒకరు. అలాగే గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా తెలుగులో కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు. సాధారణంగా గౌతమ్ మీనన్ అంటే ప్రేమ కథలు లేదా పోలీస్ నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తారు అనే గుర్తింపు ఉంది.

life of muthu movie review

కానీ ఇప్పుడు మాత్రం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా చేశారు. ఒక సాధారణ వ్యక్తి గ్యాంగ్‌స్టర్‌ గా మారడం అనే కాన్సెప్ట్ మనం చాలా సినిమాల్లో చూశాం. కానీ సినిమా చూపించే విధానం బాగుంటే సాధారణమైన కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలిచింది. సినిమాలో టేకింగ్ ఒక పెద్ద ప్లస్ పాయింట్. సినిమా మొదట్లో కొంచెం స్లోగా ఉంటుంది. కానీ సినిమా ముందుకు వెళుతున్న కొద్దీ ప్రేక్షకులని సినిమా మూడ్ లోకి తీసుకెళ్తుంది. సినిమాకి పెద్ద హైలైట్ మాత్రం శింబు. ఈ సినిమా కోసం శింబు చాలా కష్టపడ్డారు.

life of muthu movie review

అదంతా తెరపై కనిపిస్తోంది. మిగిలిన పాత్రల్లో నటించిన రాధిక, నీరజ్ మాధవ్ కూడా వాళ్ల పాత్రల్లో బాగా నటించారు. తెర వెనుక హైలైట్ అయిన హీరో ఏ ఆర్ రెహమాన్. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని ఇంకొక ఎత్తుకి తీసుకెళ్ళింది. సినిమాలో లవ్ స్టోరీ పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే హీరోయిన్ సిద్ధి ఇద్నానీ పాత్రకు కూడా అంత పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఉన్నంత వరకు బాగానే చేసింది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటుల పెర్ఫార్మెన్స్
  • పాటలు
  • టేకింగ్
  • పాత్రలని చూపించిన విధానం

మైనస్ పాయింట్స్:

  • స్లోగా అనిపించే కొన్ని సీన్స్
  • లవ్ ట్రాక్

రేటింగ్ :

3.5/5

ట్యాగ్ లైన్ :

ఈ మధ్య వచ్చిన సినిమాల్లో టేకింగ్ బాగున్న కొన్ని సినిమాల్లో ఒకటిగా ఇది నిలుస్తుంది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలని, యాక్షన్ కథలని ఇష్టపడేవారికి లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా కచ్చితంగా నచ్చుతుంది.


End of Article

You may also like