Home Filmy Adda బాలయ్య “అన్‌స్టాపబుల్ విత్ NBK” షోకి రాబోతున్న… ఆ 4 స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

బాలయ్య “అన్‌స్టాపబుల్ విత్ NBK” షోకి రాబోతున్న… ఆ 4 స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

by Mohana Priya

థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి.

తెలుగు ఓటిటి ఆహ కూడా భిన్నమైన కంటెంట్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ అనే టాక్ షోను ఆహ తీసుకొచ్చింది. ఈ షోలో పలువురు సెలెబ్రిటీలను బాలయ్య బాబు మాట్లాడించారు. గత సీజన్ ఎంతో విజయవంతంగా నడిచింది. అందులో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు వచ్చి బాలకృష్ణ తో మాట్లాడి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

unstoppable with nbk

మోహన్ బాబు ఫ్యామిలీతో మొదలైన ఈ షోలో తర్వాత, నాని, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఇలా చాలా మంది అతిథులుగా వచ్చారు. ఇప్పుడు దాని నెక్స్ట్ సీజన్ వస్తుంది. దీనికి సంబంధించి ఇటీవల ప్రకటన కూడా చేశారు. ఇందులో వచ్చే గెస్ట్ లు ఎవరో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఈసారి కూడా గత సీజన్ లో లాగానే తెలుగు ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందిన ప్రముఖులు ఈ షో కి వస్తారు. ఇప్పుడు అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, నాగార్జున అతిథులుగా రాబోతున్నారు అనే సమాచారం.

first guest in balakrishna unstoppable program

వీరిలో కొంతమంది గత సీజన్ లో రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఇప్పుడు వీళ్లు అతిథులుగా వస్తారు అని సమాచారం. వీరు మాత్రమే కాకుండా డైరెక్టర్ త్రివిక్రమ్ అలాగే మరికొంత మంది ప్రముఖులు కూడా ఈ షోకి వస్తారు. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

You may also like