Ads
గత కొంత కాలం నుండి తెలుగు ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉన్న స్నేహం ఇంకా ఎక్కువగా బయటికి వస్తోంది. సాధారణంగా మల్టీస్టారర్ సినిమాలు చేయడం అనేది సహజమే. కానీ గత కొంత కాలం నుండి కాంపిటీషన్ లో ఉన్న స్టార్ హీరోలు కూడా ఒకరితో ఒకరు కలిసి సినిమాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి ఉంటారు.
Video Advertisement
కానీ అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ గొడవ పడుతూ ఉంటారు. అభిమానులు కూడా కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో హీరోలు కూడా వారు స్నేహితులం అని, వారు వారు బానే ఉంటారు అని చెప్పటానికి కలిసి బయటికి రావడం, ఒకరి సినిమాని ఒకరు సపోర్ట్ చేయడం, కలిసి సినిమాలు చేయడం వంటివి చేస్తున్నారు. దాంతో అభిమానులు అందరూ కూడా కలిసి ఉంటున్నారు. కానీ మళ్లీ సడన్ గా ఏదో ఒక విషయంలో అభిమానుల మధ్య గొడవ అయ్యి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఇటీవల ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. సినిమాకి అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం రాజమౌళితో పాటు ఇలా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం. సినిమా ప్రమోషన్స్ లో కూడా రాజమౌళితో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఆ ఇద్దరు హీరోలు ఎంత స్నేహంగా ఉంటారో ఈ ప్రమోషన్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు చూస్తే అర్థం అయిపోతుంది. అయితే ఇటీవల ఈ సినిమాలో బెస్ట్ యాక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతో పెద్ద అవార్డ్ అయిన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ కి పంపాలి అంటూ ఒక ప్రముఖ మ్యాగజిన్ రాసింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ కి వెళ్లట్లేదు అంటూ వార్త వచ్చింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article