బాహుబలిని మించిన “బాలకృష్ణ” పాన్-ఇండియన్ సినిమా..! ఎందుకు ఆగిపోయింది..?

బాహుబలిని మించిన “బాలకృష్ణ” పాన్-ఇండియన్ సినిమా..! ఎందుకు ఆగిపోయింది..?

by Megha Varna

Ads

టాలీవుడ్ లో బాలకృష్ణ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటనకు అభిమానులు ఎప్పుడు ఫిదా అయిపోతునే ఉంటారు. అయితే బాలకృష్ణ పాన్ ఇండియా సినిమా అయిన విక్రమ్ సింహ భూపతి స్టోరీ గురించి చూద్దాం.

Video Advertisement

బాలకృష్ణ సన్నిహితుడు భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి తన దగ్గరికి వచ్చినప్పుడు జానపద చిత్రం చేయొచ్చు కదా అని అన్నారు. ఇలా అనడానికి కారణం ఏమిటంటే.. 2001లో సంక్రాంతికి నరసింహనాయుడు సినిమా తెర మీదకి వచ్చింది అయితే మృగరాజు సినిమా వచ్చినా దేవి పుత్రుడు సినిమా వచ్చినా నరసింహ నాయుడు మాత్రం హిట్ అయింది.

ఏకంగా 100 రోజులు ఆడింది నరసింహనాయుడు సినిమా. పైగా బాలకృష్ణ కి ఎంతో క్రేజ్ ని కూడా ఈ సినిమా తీసుకు వచ్చింది. దీనితో ఈ సినిమా కూడా ప్రజలకి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పడంతో త్రిపురనేని మహారధి కి చెప్పగా అతను స్క్రిప్ట్ డెవలప్ చేసారు. అయితే ఈ విక్రమ సింహ భూపతి సినిమాలో విక్రమ సింహ, భూపతి రెండు పాత్రల్లో బాలకృష్ణ నటిస్తారు.

ఇక కధ చూస్తే..కొందరు బందిపోటు దొంగలు ఓ గ్రామాన్ని దోచుకోవాలనుకుంటారు. అప్పుడు ప్రతాప వర్మను చూసి కాళ్ళకి నమస్కారం చేసెళ్లిపోతారు. నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ప్ర‌తాప్‌ వ‌ర్మ సామ్రాజ్యానికి యువరాజు. విక్రమ సింహా భూపతి బాలయ్య తండ్రి. కొందరు వెన్నుపోటు పొడిచి విక్రమ సింహ భూపతిని చంపగా… బాలయ్య నానమ్మ ఓ గూడేనికి బాలయ్యను తీసుకు వచ్చేస్తుంది. పెద్దయ్యాక ప్రతాప్ వర్మ తన తండ్రిని చంపిన వాళ్లపై రివెంజ్ తీర్చుకుంటాడు. ఇదే స్టోరీ. ట్విస్టులు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి.

ఈ సినిమాకి హీరోయిన్‌గా రోజాను, అంజలా జవేరి ని అనుకున్నారు. 2001లో షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. 2002 లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. ఇంచుమించు సగం షూటింగ్ పూర్తయిపోయింది. కానీ ఓ సిద్ధాంతి ఎస్ గోపాల్ రెడ్డితో ఈ సినిమా వల్ల నీకు ఇబ్బంది వస్తుందన్నారు. బాలయ్య గ్యాప్ తీసుకోవడం, నానమ్మ పాత్ర చేస్తున్న భానుమతికి ఆరోగ్యం బాగోకపోవడం, నిర్మాత గోపాల్‌ రెడ్డికి కూడా అనారోగ్య సమస్యలకు రావడం వలన సినిమాని మధ్యలోనే ఆపేసారు. ఇది వచ్చి ఉంటే బాహుబలిని మించిపోయేది ఈ చిత్రం.


End of Article

You may also like