బిగ్‌బాస్ “శ్రీ సత్య” లవ్ స్టోరీ..! పెళ్లి వరకు వెళ్లిన వీరి బ్రేకప్ కి కారణం ఏంటి..?

బిగ్‌బాస్ “శ్రీ సత్య” లవ్ స్టోరీ..! పెళ్లి వరకు వెళ్లిన వీరి బ్రేకప్ కి కారణం ఏంటి..?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ తెలుగు రెండు వారాలు పూర్తి చేసుకుంది. మూడవ వారానికి సంబంధించిన నామినేషన్స్ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో హౌస్ లో ఉన్న కొంత మంది తప్ప దాదాపు అందరూ నామినేట్ అయ్యారు. గేమ్ కూడా చాలా సీరియస్ గా సాగుతోంది. ఇప్పుడు ఇంటి సభ్యులు అందరూ కూడా దొంగ పోలీస్ టాస్క్ లో ఉన్నారు.

Video Advertisement

సీరియల్స్ తో ఫేమస్ అయ్యి, ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ఇంకా ఫేమస్ అయిన నటి శ్రీ సత్య. శ్రీ సత్య షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో కూడా నటించారు. అలాగే రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో శ్రీ సత్య కనిపించారు. శ్రీ సత్య ప్రస్తుతం బిగ్ బాస్ లో బాగా గుర్తింపు సంపాదించుకున్న టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్నారు.

bigg boss telugu 6 sri satya love story

ముక్కు సూటిగా మాట్లాడుతారు అని. తాను ఏది అనుకుంటే అది మాత్రమే చెప్తారు అని, ఎప్పుడు ఫేక్ గా చేయలేదు అని, తన వ్యక్తిత్వమే అంత అని చాలా మంది శ్రీ సత్యని పొగుడుతున్నారు. ఇదిలా ఉండగా, శ్రీ సత్య అంతకుముందు ఒకరితో ప్రేమలో ఉన్నారు అని, వారి ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది అని కానీ కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు అని వార్తలు వచ్చాయి. శ్రీ సత్య నటుడు పవన్ రెడ్డితో ప్రేమలో ఉన్నారు. వారిద్దరూ ఇంట్లో వారిని ఒప్పించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.

bigg boss telugu 6 sri satya love story

ఈ విషయంపై శ్రీ సత్య మాట్లాడుతూ, పవన్ తనని మోసం చేశాడు అని, అందుకే వారి రిలేషన్ షిప్ ముందుకి వెళ్లకుండా ఆగిపోయింది అని చెప్పారు. ఈ విషయంపై పవన్ కూడా స్పందించి మాట్లాడారు. శ్రీ సత్య చెప్పింది కేవలం తన వర్షన్ మాత్రమే అని అన్నారు. “ఒకవేళ నేను అంత మోసం చేసే వాడిని అయితే పెళ్లి చేసుకోవాలి అని ఎందుకు అనుకుంటాను” అని అన్నారు. వారు విడిపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియదు.


End of Article

You may also like