“లవర్” తో భర్త పెళ్లి..! ఇలాంటి భార్యలు కూడా ఉంటారా..?

“లవర్” తో భర్త పెళ్లి..! ఇలాంటి భార్యలు కూడా ఉంటారా..?

by Megha Varna

Ads

ఇదెక్కడి వింత చోద్యం..? సాధారణంగా ఏ భర్తకి అయినా సరే అక్రమ సంబంధం ఉందని తెలిస్తే అతని తాట తీస్తుంది. లేదంటే విడాకులిచ్చి వాళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి చెప్పేస్తుంది. కానీ ఈమె మాత్రం చాలా వెరైటీగా ప్రవర్తించింది. ఇలాంటి భార్యలు ఎక్కడ వుండరు. ఈమె చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యిపోయింది.

Video Advertisement

ఏకంగా భర్తని ప్రియురాలికి ఇచ్చి వివాహం చేసింది ఈ భార్య. దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. టిక్ టాక్ లో ఏర్పడిన ప్రేమ కాస్తా పెళ్లిగా మారింది. అది కూడా ఒక మహిళ తన భర్త కి దగ్గరుండి ప్రియురాలితో పెళ్లి చేసింది. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఇది చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్ కు చెందిన ఒక అతను డిగ్రీ పూర్తి చేశాడు.

తర్వాత టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ ఉండేవాడు. ఇతనికి విశాఖ పట్టణానికి చెందిన ఒక యువతి తో పరిచయం ఏర్పడింది. ఇంకేముంది పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కూడా కొన్ని రోజుల పాటు చనువుగా ఉన్నారు ఆ తర్వాత ఇరువురు దూరమయ్యారు. తర్వాత కడపకు చెందిన మరొక అమ్మాయితో టిక్ టాక్ లోనే ప్రేమలో పడ్డాడు ఈ యువకుడు. ఇక్కడే సినిమా లెక్కలో సీన్ జరిగింది. విశాఖపట్నానికి చెందిన యువతి తిరుపతికి వచ్చేసింది. అతనికి పెళ్ళై పోయిందని ఆమె తెలుసుకుని తన ప్రియుడి కోసం తిరుపతికి వచ్చింది.

ఎవరైనా అయితే గొడవ పడడం లాంటివి చేస్తారు. ఇక్కడ మాత్రం అలా ఏమి జరగలేదు. తన ప్రియుడని..తనంటే ఇష్టం అని ఆమె అతని భార్యతో చెప్పింది. మామూలుగా ఏ భార్య కూడా ఇటువంటి వాటిని అసలు వినదు. సహించలేదు. ముగ్గురు కలసి ఉందాము అని విశాఖపట్నానికి చెందిన అమ్మాయి ప్రియుడి భార్యతో చెప్పగా దీనికి ఆమె కూడా ఒప్పుకుని దగ్గరుండి మూడు ముళ్ళు వేయించింది. పెళ్లి కూతుర్ని కూడా తానే స్వయంగా ముస్తాబు చేసింది.


End of Article

You may also like