ఈమె లేకపోతే బిగ్ బాస్-6 పరిస్థితి ఏమిటి..?

ఈమె లేకపోతే బిగ్ బాస్-6 పరిస్థితి ఏమిటి..?

by Megha Varna

Ads

బిగ్ బాస్ లో గలాటా గీతూ ప్రవర్తనని మనం మొదటి నుండి చూస్తూనే ఉన్నాము. చిత్తూరు స్లాంగ్ లో ఈ అమ్మడు చకచకా మాట్లాడేస్తుంది. అదే విధంగా ఓవరాక్షన్ కూడా చేస్తూనే ఉంటుంది ఒక్కో సారి గీత ప్రవర్తన చూస్తే చాలా మందికి చిరాకు కూడా వచ్చేస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోని చూస్తే ఆమె ఆటిట్యూడ్ కనపడుతోంది.

Video Advertisement

ఏంట్రా బాబు ఈ అమ్మాయి అన్నట్లు చాలా మంది అనేలా గీతూ ప్రవర్తిస్తుంది. పైగా ఏ రూల్స్ లేకుండా ఏ ఎథిక్స్ లేకుండా ఈమె హౌస్ లో ఉంటుంది.

నిజానికి ఈమె ప్రవర్తనకి హద్దే ఉండదు. కానీ మొన్న ఈమె కాన్ఫిడెన్స్ కి నాగార్జునే ఫిదా అయ్యిపోయారు. గీతూ ఆటలో అమ్మనాన్నా ఉన్నా కూడా నేను ఓడించేస్తా అనే సరికి నాగార్జున ఫిదా అయ్యారు. దీనితో తెగ చప్పట్లు కొట్టేసారు కూడా. ఒక పక్క ఈమెని మెచ్చుకుంటున్న మరో పక్క ఈమె విమర్శలకి కూడా గురవుతోంది.

ఈమె బిహేవియర్ ని చూస్తే చాలా మంది ప్రేక్షకులకు చిరాకు వచ్చేస్తోంది. అయితే ఈమె అల్లరి అరుపులు ఇవన్నీ కూడా చాలా మందికి నచ్చడం లేదు. కానీ గీతూ మాత్రం హౌస్ లో కనుక లేకపోతే హౌస్ అంతా కూడా సైలెంట్ గా అయిపోతుంది. ఏ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండదు. చాలా మంది హౌస్ లో ఉండే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వారికి నచ్చినట్టుగా ఉంటున్నారు.

అందుకనే గీతూ తప్పక బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని ఎంతో మంది అంటున్నారు. అందుకే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. శ్రీ సత్య, వాసంతి మేకప్ వేసుకోవడం తప్ప మరొకటి చేయడం లేదు. బాలాదిత్య ఒక రేలంగి మావయ్య లాగా హౌస్ లో ఉన్నాడు. రేవంత్ పరవాలేదు. శ్రీహాన్ కూడా ఈ మధ్య మరింత బెటర్ అవుతున్నాడు.


End of Article

You may also like