ఒక్క పాటకి “మంగ్లీ” తీసుకుంటున్న… పారితోషకం ఎంతో మీకు తెలుసా…?

ఒక్క పాటకి “మంగ్లీ” తీసుకుంటున్న… పారితోషకం ఎంతో మీకు తెలుసా…?

by Megha Varna

Ads

మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పాటలతో బాగా పాపులర్ అయిపోయింది. ఎంతో మందిని తన పాటలతో ఫిదా చేసేసింది. ఎన్నో కష్టాలు పడిన మంగ్లీ తన ట్యాలెంట్ తో అవకాశాలని సొంతంగా పొందింది. ఎవరు కూడా ఒక రోజులో ఎదిగి పోలేరు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మనం ఎంతో తపన పడాలి.

Video Advertisement

ప్రయత్నం చేయాలి. అప్పుడే సక్సస్ ని అందుకోవడానికి అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కళ ఉంటుంది. ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది దాన్ని మనం స్వయంగా గుర్తించాలి.

దానిపై కాస్త శ్రమిస్తే తిరిగి మనం జీవితాన్ని చూసుకోక్కర్లేదు. మంగ్లీ కూడా అలానే చేసిందేమో. ఆమె కూడా ఒక్క రోజులో ఎదిగి పోలేదు. ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఈరోజు ఈ స్టేజ్ కి రావడానికి చాలా ఎక్కువ శ్రమించింది. అలా శ్రమపడితే ఎవరికైనా విజయం అందుకోవడం సాధ్యం.

మంగ్లీ మొట్టమొదటిసారి జీతం తీసుకున్నప్పుడు ఆమె జీతం కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే. ఇప్పుడు మాత్రం ఉన్నత స్థాయికి చేరుకుంది. ఒక్కో పాటకు ఐదు లక్షల రూపాయల వరకూ మంగ్లీ తీసుకుంటోందని అంచనా. మంగ్లీ తీన్మార్ వార్తలు తో మనకి పరిచయం అయింది. అక్కడ నుంచి ఆమె పాటలతో దూసుకు వెళ్ళడం మొదలు పెట్టింది. సినిమా పాటలు, బతుకమ్మ పాటలు ఇలా ఎన్నో పాటలు పాడింది ఈమె.

బతుకమ్మ పాటలలో ఎక్కువగా మనకి మంగ్లీ పాటలు వినబడుతూ ఉంటాయి. పైగా మంగ్లీ ఎంతో జోష్ తో పాటలు పాడుతూ ఉంటుంది. మొదట మంగ్లీ గాయకురాలిగా పరిచయం అయినప్పుడు ఆమెకి పదివేల రూపాయలు ఇచ్చేవారు.

కానీ ఇప్పుడు ఏకంగా లక్షల్లో ఆమె సంపాదిస్తోంది ఆమె క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. చాలా మంది మంగ్లీ పాటలు కి ఫ్యాన్స్ అయిపోయారు. యాంకర్ మంగ్లీ నుండి సింగర్ మంగ్లీ అయిపోయింది ఇప్పుడు తిరుగు లేని ఫాలోయింగ్ లక్షల్లో ఆదాయాన్ని కూడా పొందుతోంది మంగ్లీ.


End of Article

You may also like