PS -1 లో “త్రిష” ధరించిన ఈ నగల వెనకున్న అసలు కథ తెలుసా.? ఆ విషయంలో “మణిరత్నం” గారు?

PS -1 లో “త్రిష” ధరించిన ఈ నగల వెనకున్న అసలు కథ తెలుసా.? ఆ విషయంలో “మణిరత్నం” గారు?

by Megha Varna

Ads

చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత తమిళ్ సినిమా పొన్నియన్ సెల్వన్ ఇటీవల విడుదల అయ్యింది. సినిమా కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా రూపొందింది. ఆ నవలని సినిమాలాగా తీయాలి అని ఎంతోమంది నటులు, దర్శకులు ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నారు.

Video Advertisement

దర్శకుడు మణిరత్నం కూడా చాలా సంవత్సరాల నుండి ఇది సినిమాలాగా తీయాలి అని అనుకున్నారు. ఇప్పుడు దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

 

ఈ సినిమా కథతో నడిచే సినిమా. సినిమాలో ఫైటింగ్స్, ఎలివేషన్స్ వీటన్నిటికంటే కూడా కథ బలంగా ఉండడం చాలా ముఖ్యం. అలాంటి సినిమాల్లో ఒక సినిమా ఇది. కథ ఎంత ఒరిజినల్ గా ఉంటే తెరపై అంత బాగా కనిపిస్తుంది. అందుకే మణిరత్నం కథలో అసలు మార్పులు చేయలేదు. నవలలో ఎలా ఉంటే అలాగే తెరపై చూపించారు.

పర్ఫామెన్స్ విషయానికి వస్తే, సినిమా మొత్తం చాలా పెద్ద పెద్ద నటులు ఉన్నారు. చిన్న పాత్రలు అయినా సరే ఆ పాత్రల కోసం చాలా గుర్తింపు ఉన్న నటులని తీసుకున్నారు. వారందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విక్రమ్, కార్తీ పాత్రలు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కార్తీ తప్ప మిగిలిన ఎవరూ కనిపించరు. అంత బాగా నటించారు. హీరోయిన్లు త్రిష, ఐశ్వర్య రాయ్ చూడడానికి బాగున్నారు. నటన పరంగా కూడా పాత్రకి తగ్గట్టుగా నటించారు.

పైగా హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాలో త్రిష అయితే చోళా దేశపు రాజకుమారి కుందవై పాత్రలో నటించారు. త్రిష కచ్చితంగా నా పాత్ర మీ అందరికీ నచ్చుతుందన్నారు. అలానే ఈ పాత్ర పై ఎక్కువ కేరింగ్ పెట్టారని ఆమె అన్నారు. కాస్ట్యూమ్స్ విషయంలో మణిరత్నం ఎంతో జాగ్రత్తగా పడ్డారని చెప్పారు. నిజంగా నగలు మంచి లుక్ ని తీసుకొచ్చాయి. కుందమై పాత్ర లో వేసుకున్న నగలు నిజమైనవేనట. కొన్ని సీన్స్ లో అయితే నిజమైన నగలే మణీరత్నం తెప్పించడం జరిగిందని త్రిష అన్నారు.


End of Article

You may also like