Home Filmy Adda “లాస్య” తో పాటు… ఇటీవల కాలంలో “తల్లి” కాబోతున్నట్టు ప్రకటించిన సీరియల్ హీరోయిన్స్ వీళ్ళే..!

“లాస్య” తో పాటు… ఇటీవల కాలంలో “తల్లి” కాబోతున్నట్టు ప్రకటించిన సీరియల్ హీరోయిన్స్ వీళ్ళే..!

by Mohana Priya

సీరియల్ హీరోయిన్స్ కి దాదాపు సినిమా హీరోయిన్స్ కి ఉన్నంత పాపులారిటీ ఉంది. వారు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అలాగే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వారి అభిమానులకి ఇంకా దగ్గర అయ్యారు. వారి పర్సనల్ లైఫ్ లో జరిగే విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.

అలాగే యూట్యూబ్ లో కూడా వారు రోజూ చేసే పనులు ఎలా ఉంటాయి? సీరియల్ షూటింగ్ టైంలో ఎలా ఉంటారు? అసలు వారి రోజు ఎలా ఉంటుంది? అనే విషయాలను కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇటీవల ముగ్గురు సీరియల్ నటులు తాము ప్రెగ్నెంట్ అయినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వారిలో కొంత మంది యూట్యూబ్ ద్వారా ఒక వీడియో రూపంలో ఈ విషయాన్ని చెప్పారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 లాస్య

ప్రముఖ నటి లాస్య కొన్ని సంవత్సరాల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్ కాబోతున్నట్లు లాస్య తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటించారు. దాంతో నెటిజన్లు లాస్యకి అభినందనలు తెలిపారు.

serial heroines who announced their pregnancy

#2 శ్వేత

శతమానం భవతి సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న శ్వేత కూడా తల్లిని కాబోతున్నట్లు ప్రకటించారు. ఇది శ్వేత మొదటి సీరియల్. మొదటి సీరియల్ తోనే ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కారణంగా సీరియల్ నుంచి శ్వేత దూరం అయ్యారు.

serial heroines who announced their pregnancy

#3 వైష్ణవి

వైష్ణవి సీరియల్ నటి. అలాగే యూట్యూబ్ లో కూడా యాక్టివ్ గా ఉంటారు. కొంతకాలం క్రితం వైష్ణవి పెళ్లి జరిగింది. వైష్ణవి కూడా తాను తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

serial heroines who announced their pregnancy

వీరు మాత్రమే కాకుండా జబర్దస్త్ అలాగే బిగ్ బాస్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ భార్య అనూజ కూడా తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు. వీరందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు కాబట్టి ఈ విషయాలని నెటిజన్లతో షేర్ చేసుకుంటారు. దాంతో వారందరూ వీరికి అభినందనలు తెలుపుతూ ఉంటారు.

You may also like