సెలెబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిది అని అంటారు. వాళ్ళు మనకి వ్యక్తిగతంగా తెలియదు. వారికి మనం అందరం అంత పర్సనల్ గా తెలియదు. కానీ వాళ్ళ విషయాలు అన్ని మనకి తెలుస్తాయి. అందరూ సెలబ్రిటీలు వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడరు.
అయినా సరే వాళ్ళ విషయాలు స్ప్రెడ్ అవుతాయి. అందులో పెళ్లి, పిల్లలు కూడా ఒకటి. మన సెలబ్రిటీలలో కొంత మందికి కవల పిల్లలు ఉన్నారు. తాజాగా నయనతార దంపతులు కవలలకు జన్మనిచ్చారు.

సోషల్ మీడియా వేదికగా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించారు. నయనతార భర్త, ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో వారికి ఇద్దరు అబ్బాయిలు పుట్టినట్టు చెప్పారు. వీరి పెళ్లి కొన్ని నెలల క్రితం జరిగింది. అయితే అద్దెగర్భం పద్ధతిలో వీరు తల్లిదండ్రులు అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా సరే ఈ విషయం ప్రకటించిన తర్వాత చాలా మంది నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతూ కామెంట్స్ పెట్టారు.

అయితే ఈ కవల పిల్లలు ఇద్దరికీ పేర్లు కూడా పెట్టేశారు. ఈ పేర్లను పెట్టింది ఎవరో కాదు కోలీవుడ్ నటుడు సూర్య. ఉయర్, ఉలగం అని వీరి ఇద్దరికీ మమకారం చేసారు. ఉయర్ అంటే ‘లైఫ్’, ఉలగం అంటే ‘ప్రపంచం; అని అర్థం. అయితే ఈ పేర్ల వెనుక కథ కూడా ఉంది. విగ్నేష్ నయనతార పెళ్లి అయినప్పుడు సూర్య జ్యోతిక పెళ్లి కి వెళ్లారు.

అప్పుడు త్వరగా పిల్లల్ని కనండి అని ఆశీర్వదించి.. పిల్లల పేర్లు గురించి కూడా ప్రస్తావన జరిగిందట. అయితే సూర్యకి ట్విన్స్ అంటే చాలా ఇష్టం. వీళ్ళకి కవలలు పుట్టాలని సూర్య ఆశీర్వదించారు. ఒకవేళ కవలలు పుడితే ఇలా పేర్లు పెట్టమని అన్నారట. ఆ పేర్లనే విగ్నేష్ నయనతార పెట్టారు. ఇప్పుడు ఈ పిల్లల గురించి పిల్లల పేర్ల గురించి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్లు వస్తున్నాయి. విగ్నేష్ కూడా ‘నేను నయనతార అమ్మ అప్ప అయ్యాము’ అంటూ అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది.
