Home Filmy Adda నయనతార భర్త విఘ్నేష్ శివన్ “బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్టిస్ట్” గా నటించిన… ఆ “స్టార్ హీరో” సినిమా ఏదో తెలుసా..?

నయనతార భర్త విఘ్నేష్ శివన్ “బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్టిస్ట్” గా నటించిన… ఆ “స్టార్ హీరో” సినిమా ఏదో తెలుసా..?

by Mohana Priya

ఈ చిత్రాలలో నటించి సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార మంచి గుర్తింపు తెచ్చుకుంది. డాన్స్ మాస్టర్  ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమలో పడి ఏడు సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉంది.

ఎట్టకేలకు తన 37 వ యేట ఈ జూన్ 9వ తేదీన విఘ్నేష్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. విఘ్నేష్ సినిమాలోకి రాకముందు నుంచి నయనతారకి పెద్ద అభిమాని.

విఘ్నేష్ శివన్ డైరెక్టర్ మాత్రమే కాదు. పాటల రచయితగా తన కెరీర్ ని మొదలు పెట్టాడు. దాదాపు 50 పైగా పాటలకు రచయితగా వ్యవహరించాడు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. విఘ్నేష్ శివన్ మొదటి సినిమా శింబు హీరోగా నటించిన పోడా పోడి. ఈ సినిమా తర్వాత నయనతార, విజయ్ సేతుపతి నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి విఘ్నేష్ కి చాలా మంచి పేరు వచ్చింది. తర్వత సూర్య హీరోగా నటించిన గ్యాంగ్ సినిమాకి, అలానే ఇటీవల విడుదలైన కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాకి దర్శకత్వం వహించారు.

nayanthara husband acted as background artist in this superhit movie

అంతేకాదు విఘ్నేష్ సంగీత దర్శకుడిగా కూడా పలు మ్యూజిక్ ఆల్బమ్స్ ని డైరెక్ట్ చేశాడు. సినీ డైరెక్టర్ గానే కాదు డిస్ట్రిబ్యూటర్ గాను, సినీ నిర్మాతగానూ ఎన్నో చిత్రాలు చేశారు. మొత్తానికి నయనతార భర్త విఘ్నేష్ మల్టీటాలెంటెడ్ అని చెప్పవచ్చు. అయితే నయనతార భర్త విఘ్నేష్ ఒక చిత్రంలో బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి అనుకుంటున్నారా… ఈ చిత్రం మన తెలుగులో కూడా రిలీజ్ అయింది. 2015 లో యాక్షన్ అండ్ రొమాన్స్ ఎంటర్టైనర్ గా రూపొందిన వేలరాజ్ దర్శకత్వంలో ధనుష్ మరియు అమలా పాల్ నటించిన రఘువరన్ బీటెక్.

ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించారు. రఘువరన్ బీటెక్ చిత్రంలో శరణ్య, వివేక్, సురభి, సముద్రఖని వంటి వారు ప్రధాన పాత్ర వహించారు. ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా విఘ్నేష్ శివన్ కనిపిస్తారు. హీరోకి సహాయం చేయడానికి ఎంతోమంది ఎక్కడెక్కడినుంచో వస్తారు. వారిలో మొదటిగా వచ్చే వ్యక్తిగా విఘ్నేష్ శివన్ కనిపిస్తారు. అప్పటికీ విఘ్నేష్ శివన్ కేవలం ఒక్క సినిమాకి మాత్రమే దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులోనూ నేను రౌడీ నే పేరుతో విడుదల అయ్యింది.

You may also like