Ads
రాజమౌళి లాంటి ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడు రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ కి పంపలేదు. ఈ విషయంపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే ఆస్కార్ అంటేనే మండిపడుతున్నారు. ఇంత మంచి సినిమాని వదిలేసి అదేదో సినిమా అని ఆస్కార్ కి పంపారు అంటూ కామెంట్స్ చేసారు.
Video Advertisement
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాత్రమే కాదు ఎంతో మంది ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆర్ఆర్ఆర్ సినిమాకి మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేసారు.
ఇదిలా ఉంటే తాజాగా ఒక నెటిజన్ ఆర్ఆర్ఆర్ సినిమా మీద ట్వీట్ చేశారు. దానికి మంచు విష్ణువు బదులిచ్చారు. ‘ఆస్కార్ లో బెస్ట్ క్రింజ్ మూవీ క్యాటగిరి ఏమైనా ఉందా’ అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
దానికి బదులుగా మంచు విష్ణు ‘భారతీయ సినిమాగా మనం ఎందుకు జరుపుకోకూడదు సోదరా..? కేవలం ప్రాంతీయ చిత్రానికి దక్కే గౌరవం RRR కాదు. జాతీయంగా దేశం మొత్తం గర్వించదగ్గ విషయమని’ పోస్ట్ చేశారు మంచు విష్ణు.
బాలీవుడ్ కి చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ సినిమా ఆస్కార్ కి వెళ్లాల్సింది అని అన్నారు. చాలా సోషల్ మీడియా పేజెస్ అయితే ఏదో రాజకీయం జరిగింది అని, ఎప్పుడు సౌత్ సినిమాని ఇలానే తొక్కేస్తారు అంటూ కామెంట్స్ చేసారు కూడా. అయితే ఇలా అవ్వడం కొత్త ఏమీ కాదు.
అంతకు ముందు సూర్య నటించిన రెండు సినిమాల విషయంలో ఇలాగే జరిగింది. సూర్య హీరోగా నటించిన ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లి అక్కడ వెనక్కి వచ్చేసాయి. ఈసారి కూడా ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆస్కార్ కి పంపలేదు.
End of Article