Ads
ప్రతి ఆదివారం ఈ టీవీలో మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మామూలుగా అయితే ఆదివారం పూట ఎక్కువగా సినిమాలు టెలికాస్ట్ చేస్తారు. కానీ ఈ టీవీ మాత్రం డిఫరెంట్ గా ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తుంది. అది కూడా మధ్యాహ్నం పూట ఈ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది.
Video Advertisement
ఈటీవీ ఎక్కువగా వినోదాత్మక ప్రోగ్రామ్స్ ను ప్రసారం చేస్తుంది. జబర్దస్త్ కామెడీ షో తో ప్రారంభమైన ఈ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. శ్రీ దేవి డ్రామా కంపెనీ పేరుతొ మరో కామెడీ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ షోకి రష్మీ గౌతమ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంద్రజ ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ద్వారా ఎంతో మంది టెలివిజన్ కి పరిచయం అవుతున్నారు. ఇటీవల బస్ కండక్టర్ ఝాన్సీ వీడియో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నుండి ఝాన్సీ ఈటీవీలో ప్రసారం అయిన కొన్ని ప్రోగ్రామ్స్ లో కనిపించారు. ఇప్పుడు మరొక అలాంటి టాలెంట్ ని ఈ టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.
ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల అయ్యింది. అందులో నెల్లూరు కవిత అనే ఒక కొత్త వ్యక్తి డాన్స్ చేస్తూ కనిపించారు. కవితతో పాటు ఝాన్సీ కూడా డాన్స్ వేస్తూ కనిపించారు. అందరూ కవిత డాన్స్ ని మెచ్చుకుంటున్నారు. ఈ ప్రోగ్రాం తర్వాత ఝాన్సీ చాలా ఫేమస్ అయ్యారు. అలాగే ఝాన్సీ డాన్స్ వీడియోలు కూడా యూట్యూబ్ లో లక్షల వ్యూస్ సంపాదించుకున్నాయి. ఈ ప్రోగ్రాం తర్వాత కవిత కూడా ఝాన్సీ లాగా స్టార్ అయిపోతారేమో చూడాల్సిందే.
watch video :
End of Article