Ads
తెలుగులో పలు సినిమాల్లో నటించి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చేసి ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈమె చాలా తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు.
Video Advertisement
చాలామంది టాప్ హీరోల సరసన ఈమె నటించారు కూడా. అభినయంతో అందంతో ఈమె ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటారు.
ఇప్పుడు తెలుగు సినిమాలకు కాస్త దూరం అయ్యారు కానీ బాలీవుడ్ లో మాత్రం ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. 2021లో చూస్తే.. ఈమె కొండ పాలెం సినిమాలో నటించారు ఆ తర్వాత మరి ఏ తెలుగు సినిమాల్లో కూడా ఈమె నటించలేదు. ఈ సినిమా తర్వాత ఈమె కేవలం బాలీవుడ్ లో మాత్రమే నటించారు.
వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోతున్నారు రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈమె తెలుగులో సినిమాలు చేయకపోవడంతో వార్తలు చాలానే వస్తున్నాయి. తెలుగు సినిమా ఎందుకు చేయడం లేదు అంటూ చాలా మంది ప్రశ్నలు కూడా వేస్తున్నారు. రూమర్స్ కూడా వస్తూనే వున్నాయి. తెలుగులో సినిమాలు చేయడం పై ఎన్నో అనుమానాలు కూడా చాలా మందికి వస్తున్నాయి. కారణం మాత్రం తెలియలేదు.
తాజాగా డాక్టర్ జి ప్రమోషన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొనే వస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పేసారు. ”ఎందుకు తెలుగు సినిమాల్లో ఈమె నటించడం లేదని” ప్రశ్నించగా.. ఈమె ఇలా బదులిచ్చారు. చాలామంది నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారని.. తెలుగులో సినిమాలు చేయడం లేదని నాకు తెలుసు కానీ త్వరలో వస్తాను అని ఆమె చెప్పారు. పైగా తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా ఇష్టం అని.. తెలుగు ప్రేక్షకుల వల్లే ఈ స్టేజ్ లో ఉన్నానని ఆమె చెప్పారు. దీంతో ఎందుకు రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలు కి దూరంగా ఉంటున్నారు అనే దానిపై వచ్చే పుకార్లకు కూడా బ్రేక్ పడింది.
End of Article