Home Filmy Adda సలార్ లో క్లైమాక్స్ సీన్… ఇలాగే ఉండబోతోందా..?

సలార్ లో క్లైమాక్స్ సీన్… ఇలాగే ఉండబోతోందా..?

by Megha Varna

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు.

బాహుబలిలో ప్రభాస్ అసలు అప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించారు. అందుకోసం చాలా కష్టపడ్డారు. అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూశారు.

did you observed this in salaar movie independence day poster

బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచ‌నాల‌ని అందుకోలేక‌పోయింది. ఇటీవల విడుదల అయిన రాధే శ్యామ్‌కి వచ్చిన రెస్పాన్స్ కూడా అలాగే ఉంది.

ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ ఆద్య అనే పాత్ర లో నటిస్తున్నారు. అంతేకాకుండా, ఇందులో శృతి హాసన్ ఒక జర్నలిస్ట్ గా కనిపిస్తారు అనే వార్త కూడా వినిపిస్తోంది. శృతి హాసన్, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయి అని సమాచారం.

prabhas salaar movie main twist leaked

ఇదిలా ఉంటే తాజాగా క్లైమాక్స్ సీన్ లీక్ అయ్యింది. మరి దాని గురించి చూస్తే.. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ బాగుంటుందట. బాలయ్య అఖండ సినిమాలో ఎలా అయితే విలన్స్ తో ఫైట్ చేస్తాడో అలా డివోషనల్ టచ్ ని ఈ సినిమాలో ఇస్తున్నారట. కాళీమాత ఉగ్రరూపంతో విలన్స్ తో ప్రభాస్ ఫైట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా ఇలా కాళీమాత బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సీన్స్ సినిమాకి హైలెట్ అవుతాయట. కేజిఎఫ్ ఫస్ట్ పార్ట్ లో కూడా దేవుడిలా వస్తాడు. కాళీమాత ఉగ్రరూపాన్ని టచ్ చేసి ప్రభాస్ తో క్లైమాక్స్ ని చిత్రీకరిస్తున్నారట.

 

You may also like