Ads
మనసంతా నువ్వే సినిమాలో ‘తూనీగ తూనీగ’ అంటూ ఒక చిన్న పాప కనపడుతుంది. మీకు గుర్తు వుందా..? ఉదయ్ కిరణ్ రీమాసేన్ జంటగా నటించిన మనసంతా నువ్వే సినిమాలో ఈమె నటించింది. ఆ సినిమాని వి.యన్.ఆదిత్య దర్శకత్వం వహించారు. అయితే ఆ చిన్నారి పేరు సుహాని కలిత.
Video Advertisement
ఈమె ఈ ఒక్క సినిమాలోనే కాక బాల రామాయణం, గణేష్, ప్రేమంటే ఇదేరా, ఎదురులేని మనిషి, ఎలా చెప్పను, ఆనందమానందమాయే వంటి సినిమాలలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కింద నటించింది.
ఇలా ఈ చిన్నారి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గర అయ్యింది. ఈమె హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది. హీరోయిన్ గా సవాల్ సినిమాలో ఈమె నటించింది. అలానే ‘కృషి’ ‘స్నేహ గీతం’ అనే సినిమాలను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అయిన సుహాని కలిత చేసింది.
ఇటు తెలుగు చిత్రాలతోనే కాక అటు తమిళం లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించి తమిళ ప్రేక్షకులను కూడా ఫిదా చేసేసింది. కానీ ఈమె మాత్రం మంచి నటిగా సక్సెస్ అవ్వలేక పోయింది. అవకాశాలు కూడా ఈమెకి రాలేదు. దీనితో సినీ ఇండస్ట్రీ కి ఈమె దూరం అయ్యింది.
పెళ్లి చేసుకుంది ఇప్పుడు. ఈమె భర్త ఎవరు అనేది చూస్తే.. ఈమె భర్త ఓ సంగీత కళాకారుడు, మోటివేషనల్ స్పీకర్. ఇతని పేరు విభర్ హసీజాను. ఈమెకి విభర్ హసీజాను తో వివాహం అయ్యింది. అది కూడా ఈ మధ్యనే. వీళ్ళ పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. పెళ్లి కి సంబందించిన పిక్స్ సోషల్ మీడియా లో తెగ షికార్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ లో సుహాని చాలా అందంగా వుంది. సుహాని, విభోర్ ఫోటోలను మరి మీరూ చూసేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
End of Article