Ads
సాధారణంగా మన తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లని పెట్టుకోరు. వేరే హీరోయిన్లు అంటేనే మన తెలుగు వాళ్ళకి ఆసక్తి అనే గొడవ చాలా సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది. ఈ విషయంపై ఎంతోమంది మాట్లాడారు. అది చాలా వరకు నిజమే. మిగిలిన ఇండస్ట్రీ లతో పోలిస్తే తెలుగులో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ. ఈ విషయంపై మరొకసారి ప్రముఖ నటి రేఖా బోజ్ మాట్లాడారు.
Video Advertisement
రేఖా బోజ్ ఈ విషయం పై సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. KGF అండ్ కాంతారా హీరోయిన్స్. శ్రీ నిధి షెట్టి, సప్తమి గౌడ… కన్నడ వాళ్ళు కన్నడ అమ్మాయిలనే పెట్టుకుని blockbusters ఇచ్చారు.ఇది చూసి అయినా మన దర్శకులు కాస్త మారాలి(బుద్ధి తెచ్చుకోవాలి). ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి రంగితరంగ,ముంగారుమలై, దునియా, కిరాక్ పార్టీ ఇలా. కార్తికేయ 2 లో ఆ మలయాళీ కాకుండా ఒక తెలుగు అమ్మాయి ఉన్నా కూడా ఆ మూవీ అలానే ఆడుతుంది.
మన సబ్జెక్ట్ లో అండ్ మన G లో దమ్ము (గుండెల్లో దమ్ము) ఉండాలే కానీ, ఆ నార్త్,అండ్ మలయాళీ,కన్నడ అమ్మాయిలు వచ్చి ఇక్కడ చేసేది ఏం ఉండదు. డైలాగ్స్ చెప్పమంటే zero expression తో అప్పడాలు, వొడియాలు నమిలినా కూడా మనవాళ్ళకి వాళ్ళే కావాలి. మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే, చివరి రెండు వరుసల హీరోలు అయిన రాజ్ తరుణ్, కార్తికేయ, విష్వక్సేన్ లాంటి వాళ్లు ఇంకా లాస్ట్ హీరోలు కిరణ్ అబ్బవరం, శ్రీ సింహ ( కీరవాణి గారి సన్), సంతోష్ శోభన్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్ల పక్కన కూడా మన తెలుగు అమ్మాయిలు లేరు.
అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలో వాళ్లు ఆ నేటివిటీకి తగినట్లు అదే లాంగ్వేజ్ అమ్మాయిలను తీసుకుంటారు.but అదే సినిమాను మనవాళ్ళు రీమేక్ చేసినప్పుడు మాత్రం మన నేటివిటీకి తెలుగు అమ్మాయిలను కాకుండా వేరే వాళ్ళను పెడతారు. అక్కడ side actress అయిన నారప్ప,మాస్టర్ మూవీల అమ్మాయిలను మనవాళ్ళు హీరోయిన్లుగా చేసేశారు. వాళ్లు వాళ్ళ లాంగ్వేజ్ లోనే హీరోయిన్స్ కాదు అసలు. చివరికి అందరూ అసలు సినిమాల కిందే లెక్కచేయని మా వైజాగ్ ఫిల్మ్స్ లో కూడా తెలుగు అమ్మాయిలకు స్థానం లేదు. ఇది మన తెలుగు సినిమాకి పట్టిన కర్మ,దరిద్రం.” అని రాశారు.
End of Article