Ads
- చిత్రం : జిన్నా
- నటీనటులు : విష్ణు మంచు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్.
- నిర్మాత : విష్ణు మంచు (AVA ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ)
- దర్శకత్వం : సూర్య
- సంగీతం : అనూప్ రూబెన్స్
- విడుదల తేదీ : అక్టోబర్ 21, 2022
Video Advertisement
స్టోరీ :
జిన్నా (మంచు విష్ణు) తిరుపతికి చెందిన వ్యక్తి. తన స్నేహితులతో కలిసి టెంట్ హౌస్ నడుపుతూ ఉంటాడు. జిన్నా ఒక గూండా దగ్గర అప్పు చేస్తాడు. ఆ అప్పు తీర్చలేక తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. చివరికి ఆ గుండా జిన్నాని పట్టుకుంటాడు. అప్పు తీర్చకపోతే అయినా పర్వాలేదు కానీ ఒక షరతు పెడతాడు. తన సోదరి (సన్నీ లియోన్) ని వివాహం చేసుకోవాలి అని చెప్తాడు. జిన్నా చేసేదేమీలేక సరే అంటాడు. తర్వాత తన ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అసలు ఆ ఇంట్లో ఏముంది? అక్కడ జిన్నా ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? మధ్యలో జిన్నా జీవితంలో ఉన్న మరికొంత మంది వ్యక్తులు ఎవరు? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సమస్యల నుండి జిన్నా ఎలా బయట పడ్డాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
గత సంవత్సరం మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మంచు విష్ణు. ఆ సినిమా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే డిఫరెంట్ గా ఉంది. చాలా రోజుల తర్వాత విష్ణు ఒక కామెడీ సినిమాలో నటించారు. అలాగే ఇందులో కొన్ని హారర్ అంశాలు కూడా ఉన్నాయి. కథ పెద్ద కొత్తగా ఏమీ లేకపోయినా కూడా ప్రేక్షకులకి డిఫరెంట్ గా చూపించడానికి ప్రయత్నించారు.
ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీ నటులు అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు చేశారు. మంచు విష్ణు ఈ సినిమాలో చిత్తూరు యాస మాట్లాడారు. మంచు విష్ణు కూడా తన పాత్రకి తగ్గట్టుగా నటించారు. సంగీతం కూడా సినిమా కి తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువల పరంగా సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా అనిపిస్తుంది. స్క్రీన్ పై విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- కొన్ని కామెడీ సీన్స్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ
- సాగదీసినట్టుగా ఉండే స్క్రీన్ ప్లే
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక ఎంటర్టైనర్ చూద్దాం అని అనుకుంటే జిన్నా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
End of Article