Sardar Review : సర్దార్ సినిమాతో “కార్తీ” హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Sardar Review : సర్దార్ సినిమాతో “కార్తీ” హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Megha Varna

Ads

  • చిత్రం : సర్దార్
  • నటీనటులు : కార్తీ, రాశి ఖన్నా, రజిషా విజయన్.
  • నిర్మాత : ఎస్. లక్ష్మణ్ కుమార్ (ప్రిన్స్ పిక్చర్స్)
  • దర్శకత్వం : P.S. మిత్రన్
  • సంగీతం : G.V. ప్రకాష్ కుమార్
  • విడుదల తేదీ : అక్టోబర్ 21, 2022

sardar movie review

Video Advertisement

స్టోరీ :

విజయ్ ప్రకాష్ (కార్తీ) ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్. అయితే తను మీడియాలో ట్రెండింగ్ లో ఉండాలని అనుకుంటుంటూ ఉంటాడు. పైగా తాను దాని కోసం ఎంతటికైనా తెగిస్తాడు. కానీ ఇక కథ టర్న్ అవుతుంది. ఆంధ్రా యూనివర్సిటీ తాలూకా ఫైల్ ఒకటి మిస్ అవుతుంది. ఇంకేం వుంది ఇక కథ టర్న్ అవుతుంది. ఈ ఫైల్ లో పాత సైనిక రహస్యాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో CBI మరియు RAW వెతకడం షురూ చేస్తారు.

sardar movie review

ఈ విషయం మన హీరో విజయ్ ప్రకాష్ కి కూడా తెలుస్తుంది. తనకు కావాల్సింది పేరు. దీని కోసం అందరి కంటే ముందు దానిని పట్టుకోవాలని.. చేతికి చిక్కాలని చూస్తాడు. ఫైల్‌ను కనుగొనాలని అనుకుంటాడు. ఫైల్ కోసం తానే ట్రెండింగ్ అయ్యిపోతానని అనుకుంటాడు. ఇలా ఈ ఫైల్ ప్రాసెస్ లో విజయ్ తండ్రి అయిన సర్దార్ గురించి తెలుస్తుంది. ఆయన మిషన్ గురించి తెలుస్తుంది. ఈ మిషన్ లో పార్ట్ అవుతాడు. ఆ మిషన్ ఏమిటి..?, ఏం చేస్తాడు విజయ్ ప్రకాష్ అనేదే సర్ధార్ కథ.

రివ్యూ :

తమిళ్ హీరో అయినా సరే తెలుగులో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో ఒకరు కార్తీ. కార్తీ తన సినిమాలని తెలుగులో విడుదల చేయడం మాత్రమే కాకుండా తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. ఆ సినిమాలో కార్తీ ఏ యాస మాట్లాడినా సరే తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో మన ముందుకు వచ్చారు కార్తి. ఇప్పుడు ఈ సినిమాలో డబుల్ యాక్షన్ లో నటించారు. అలాగే దర్శకుడు కూడా అభిమన్యుడు సినిమా తెలుగులో కూడా హిట్ కొట్టారు.

sardar movie review

దర్శకుడు చక్కటి కథను ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చాడు. ఈ సినిమాలో అన్ని కూడా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా చేసారు. ఈ సినిమా బిగినింగ్ కూడా చాలా బాగుంటుంది. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే అదిరిపోతోంది. చాలా సీన్స్ ప్రేక్షకులని ఇంప్రెస్ చేసేలా వున్నాయి. అయితే సెకండ్ హాఫ్ కాస్త స్లో గా నడుస్తుంది. కానీ మళ్ళీ ఇంట్రస్టింగ్ గా మారిపోతుంది. క్లైమాక్స్ దాకా బాగుంటుంది ఈ చిత్రం.

ప్లస్ పాయింట్స్ :

  • స్టోరీ
  • స్క్రీన్ ప్లే
  • బీజీఎమ్
  • కార్తీ నటన

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్

రేటింగ్ : 3/5

ట్యాగ్ లైన్ :

ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో ఉంటుంది సినిమా. మిమ్మల్ని సినిమాలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేలా చేసేస్తుంది. ఈ చిత్రం మీ అంచనాలకి తగ్గట్టే ఉంటుంది. నిరాశ పరచదు.


End of Article

You may also like