Ads
ఇది వరకు చాలా తక్కువ మంది మాత్రమే గుండెపోటుతో మరణించే వారు కానీ ఈ మధ్య గుండె పోటు చాలా మందిలో వస్తోంది. పైగా చాలా మంది గుండె పోటు సమస్య రావడం వలన చనిపోతున్నారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలు దరి చేరకుండా చూసుకోవాలి.
Video Advertisement
గుండెపోటు కేవలం పెద్ద వారిలోనే కాదు చిన్న వారిలో కూడా వస్తూ ఉంటుంది. తాజాగా గుండెపోటుతో మరణించాడు ఒక స్కూల్ విద్యార్థి. మరి ఇంక పూర్తి వివరాల్లోకి వెళితే…
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఇది చోటు చేసుకుంది. మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ లోనే హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు. ప్రాథమికోన్నత పాఠశాలలో బుర్ర కౌశిక్ గౌడ్ మూడవ తరగతి చదువుతున్నాడు. స్కూల్ లోనే గుండె పోటు వచ్చింది. భోజనం కోసం స్కూల్ లో లైన్ లో నిలబడ్డాడు. మాములుగా స్కూల్ లో పన్నెండింటికి లంచ్ పెడతారు. కానీ గ్రహణం మూలాన పదకొండుకే పెట్టేసారు. మంగళవారం స్కూల్‌లో లంచ్ కోసం బుర్ర కౌశిక్ గౌడ్ అందరిలానే లైన్ లో నిలబడ్డాడు.
హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే విద్యా వాలంటీర్లు కౌశిక్ దగ్గరకి వచ్చి కాళ్ళు చేతులు రాసారు. అలానే ఆర్ఎంపీ డాక్టర్‌ని పిలిచి చూపించారు. కరీంనగర్ హాస్పటల్‌కు కూడా తీసుకు వెళ్లారు.
కౌశిక్ తల్లి కూడా అప్పుడు వచ్చారు. అయితే ప్రయోజనం మాత్రం ఏమి లేదు. మూడవ తరగతి చదువుతున్న బుర్ర కౌశిక్ గౌడ్ చనిపోయాడు. ఈ పిల్లవాడు ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు చెప్పారు. పైగా వారికీ ఒక్కగాని ఒక్క కొడుకు అవ్వడంతో బోరుమని ఏడుస్తున్నారు కుటుంబ సభ్యులు. కానీ ఇంత చిన్నవాడికి హార్ట్ అటాక్ రావడం, మరణించడం బాధాకరం.
End of Article