Home Filmy Adda విజయ్ దేవరకొండ పై… బాలీవుడ్ నటి కామెంట్స్..! అప్పుడు వెటకారం చేసాడు అంటూ..?

విజయ్ దేవరకొండ పై… బాలీవుడ్ నటి కామెంట్స్..! అప్పుడు వెటకారం చేసాడు అంటూ..?

by Megha Varna

టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా సక్సెస్ లతో పాటు ఫ్లాపులను కూడా ఎదుర్కొన్నాడు.

ఇక తాజాగా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

actors who are first choice for liger movie

ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి భారీ అంచనాలే పెట్టుకోగా అన్ని తలకిందులయ్యాయి. పుష్ప క్లైమాక్స్ సన్నివేశాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని లైగర్ క్లైమాక్స్ చేసారు. ఏది ఏమైనా ఈ సినిమా హిట్ అవ్వలేదు. డిజాస్టర్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూ లో బాలీవుడ్ నటి మలోబిక బెనర్జీ విజయ్ మీద కామెంట్స్ చేసింది. హిందీ భాషని ఒకప్పుడు విజయ్ అవమానించాడని… కానీ లైగర్ ని హిందీ లో చేయడం షాకింగ్ గా ఉందని ఆమె అంది. హిందీ అర్ధం అవ్వకపోవడం వలన విజయ్ ‘హెబ్రూ భాష’ అని హిందీని అన్నాడని మలోబిక బెనర్జీ చెప్పింది. కానీ అదే విజయ్ ఇప్పుడు హిందీలో డైలాగ్స్ చెబుతుంటే నవ్వొచ్చిందని ఆమె అంది.

You may also like