Home Filmy Adda చిరంజీవి కథతో బాలయ్య సినిమా..? డైరెక్టర్ ఎవరంటే..?

చిరంజీవి కథతో బాలయ్య సినిమా..? డైరెక్టర్ ఎవరంటే..?

by Megha Varna

చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యింది. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు.

దాని తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్.

godfather movie review

కానీ తెలుగులో చాలా మార్పులు చేశారు. ప్రేక్షకులు నిరాశ పడకుండా ఉండేలాగా ఎలివేషన్స్, డైలాగ్స్ బలంగా ఉండేలా చూశారు. కానీ ఈ సినిమా ఊహించనంతగా లేదు. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భీష్మ పర్వం సినిమా రైట్స్ తీసుకున్నారు. ఇది మలయాళం సినిమా. ఇందులో చిరు నటించనున్నారు అని టాక్. అలానే ఎన్నై అరిందాల్ రీమేక్ సినిమాలో మరియు భోళా శంకర్ లో కూడా చేస్తున్నారు.

balayya-babu-akhanda-news

అయితే చిరు వెంకీ కుడుములు సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. కానీ దానిని పక్కన పెట్టేశారట. కానీ ఆ స్టోరీ బాలయ్య బాబుకి నచ్చడంతో సినిమాకు సై అన్నారట. వీర సింహా రెడ్డి సినిమా షూటింగ్ అయ్యాక ఈ సినిమా షూటింగ్ షురూ కానున్నట్టు తెలుస్తోంది.

You may also like