Ads
స్నేహ సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ మ్యాగజిన్ స్పెక్ట్రమ్ కి చీఫ్ ఎడిటర్ గా చేస్తున్నారు, అంతే కాకుండా కాలేజ్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా స్టూడియో పికాబూ పేరుతో ఒక ఫోటోగ్రఫీ స్టూడియో కూడా స్థాపించారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతుంటారు స్నేహ.
Video Advertisement
అలానే కుటుంబానికి సంబంధించి విషయాలను కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటారు. సెలబ్రిటీలు కానీ సెలబ్రిటీల భార్యలు కానీ ఏదైనా అందమైన చీరలని కానీ ఏదైనా డ్రెస్ ని కానీ ధరించారంటే దాని గురించి నెటిజన్లు వివరాలను సేకరిస్తూ ఉంటారు.
తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ధరించిన సిల్వర్ శారీ హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ అసలు ఆ చీర ధర ఎంత అనే విషయానికి వస్తే… అందమైన సిల్వర్ శారీని ధరించిన స్నేహ రెడ్డి చీర ధర లక్షా డబ్భై ఆరు వేల రూపాయలు. ఇది చూసి చాలామంది స్టన్ అవుతున్నారు. దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులతో విందు సమయంలో స్నేహ రెడ్డి ఈ చీర ని ధరించారు.
దీపావళి పండుగ అంటే మంచి చీరనో లేదంటే ఏదైనా మంచి డ్రెస్ ని కానీ ప్రిఫర్ చేస్తుంటారు. స్నేహా సిల్వర్ చీరని వేసుకున్నారు. అయితే నెటిజన్స్ ఈ చీర గురించి ఎంక్వయిరీ చేయగా దీని ధర లక్షా డబ్భై వేల రూపాయలని తెలుస్తోంది అయితే సెలబ్రిటీలు ఇంత రేంజ్ లో చీరలు ధరించడం కొత్తేమి కాదు చాలామంది సెలబ్రిటీలు లక్షల రూపాయిలు ఖరీదైన చీరలు ధరిస్తూ ఉంటారు. స్నేహ రెడ్డి వేసుకున్న చీర కూడా చాలా బాగుంది. ధర పక్కన పెడితే కలర్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది.
End of Article