ఆ సెంటిమెంట్ ని “రష్మిక” ఇప్పటికీ ఫాలో అవుతోందా..?

ఆ సెంటిమెంట్ ని “రష్మిక” ఇప్పటికీ ఫాలో అవుతోందా..?

by Megha Varna

Ads

కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. ఇక ఆ తర్వాత విజయ్‌ తో గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి సినిమాలు చేశారు. తన నటన తో పాటు అంద చందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్నారు.

Video Advertisement

పుష్ప వంటి పాన్ ఇండియా చిత్రం తో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఆ సినిమా తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది రష్మిక.

ఇలా ఉండగా ..ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్‌కి స్టార్ నటి రష్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అనేక మెక్‌ డొనాల్డ్స్ ప్రకటన ప్రకటనల లో రష్మిక మనకు కనిపించింది. ఇప్పుడు ఈ బ్యూటీ పేరుతో ఆ సంస్థ భోజనంను కూడా ప్రవేశ పెట్టింది. అయితే రష్మిక మందన్న కి సంబంధించి ఇప్పుడో తెలియని విషయం బయట పడింది.

మామూలుగా ఏ సినిమానైనా నటించే ముందు కొంత మంది నటులు సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. సెంటిమెంట్ ని ఫాలో అవ్వడం వలన సినిమా హిట్ అవుతుందని భావిస్తూ ఉంటారు. అయితే ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి. ముద్దుగుమ్మ రష్మిక మందన్న కి కూడా ఒక సెంటిమెంట్ ఉందట. మరి ఇంక ఆ సెంటిమెంట్ ఏమిటి అనేది చూస్తే… మామూలుగా ఎవరి దగ్గరైనా డబ్బులు వున్నప్పుడు బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే రష్మిక మాత్రం ఏదైనా సినిమా లో నటించిన ముందు బంగారం, వెండి కొనుగోలు చేస్తుందట. అలానే కచ్చితంగా పండగలకు కూడా బంగారాన్ని వెండిని కొనుగోలు చేయడం రష్మిక కి అలవాటు.


End of Article

You may also like