Ads
సంధ్య జనక్ పలు తెలుగు సినిమాలో నటించి పేరు తెచ్చుకుంది. అర్జున్ రెడ్డి (2017), భరత్ అనే నేను (2018), 118 (2019) వంటి సినిమాల్లో నటించింది. చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ తో కూడా ఈమె నటించింది. హ్యాపీ డేస్ సినిమాలో తమన్నా కి తల్లిగా కూడా ఈమె నటించింది. అయితే సినిమాల్లో చేయడం అందరికీ సాధ్యం కాదు.
Video Advertisement
ట్యాలెంట్, ఆర్ట్ ఉన్నప్పటికీ కూడా అదృష్టం కూడా ఉండాలి. అలానే చాలా మందికి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా సినీ కెరియర్ త్వరగా ముగిసిపోతుంది.
మొదట అవకాశాలు వచ్చి ఆ తర్వాత అవకాశాలు పోతాయి కూడా. కాబట్టి చక్కటి నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉండాలి. చాలా మంది సెలబ్రిటీల నోట మనం ఈ మాట వింటూనే ఉంటాం… మా సీన్స్ ని కట్ చేశారని.. సినిమా రిలీజ్ అయిన తర్వాత చెబుతూ ఉంటారు. తాజాగా సంధ్యా జనక్ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసింది. అందంగా, హుందాగా ఈమె తన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈమె నటించన చాలా సినిమాలు విజయవంతం అయ్యాయి కూడా. అనసూయ, మర్యాద రామన్న, శ్రీరామరాజ్యం, కొత్తజంట వంటివి హిట్లు కొట్టాయి.
ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లయింది. ఈ ఏడేళ్లల్లో 50 సినిమాలకు పైగా ఈమె నటించారు. అయితే మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమాలో ప్రకాష్ రాజ్ భార్య కింద ఈమె నటించిగా.. సీన్స్ డిలీట్ చేశారట. ఈ సినిమా షూటింగ్ కోసం లక్నో వెళ్లామని .. అక్కడ షూటింగ్ చేశారని ఈమె చెప్పింది. మహేష్ బాబుతో చేసిన సీన్స్ ని రెండు మూడు సార్లు రీటెక్ చేశారట. అంతేకాక డబ్బింగ్ పనులు కూడా పూర్తయిపోయాయి. కానీ సినిమా చూసిన తర్వాత ఆమె పాత్ర ఏ లేదుట. దీంతో ఆమె షాక్ అయ్యానని చెప్పింది. ఈ సినిమా మాత్రమే కాకుండా రాధే శ్యామ్ సినిమాలో కూడా ఈమె సీన్స్ ని డిలీట్ చేశారని ఈమె చెప్పింది.
watch video
End of Article