Home Filmy Adda సమంత కి సారీ చెప్తున్న నెటిజన్స్..! కారణం ఏంటంటే..?

సమంత కి సారీ చెప్తున్న నెటిజన్స్..! కారణం ఏంటంటే..?

by Megha Varna

హీరోయిన్ సమంత తాను ‘మయోసైటిస్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించగానే అభిమానులు ఆశ్చర్యపోయారు. అక్కినేని నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత మీడియాకి దూరంగా ఉండిపోయిన సమంత.. తన కొత్త మూవీ ‘యశోద’ ప్రమోషన్స్‌లో కూడా ఎక్కువగా కనిపించడం లేదు.

దీంతో ఆమె అమెరికాలో సర్జరీ చేయించుకుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ తనకి ‘మయోసైటిస్‌’వ్యాధి ఉన్నట్లు సమంత ప్రకటించింది. ఈ వ్యాధికి గత కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు కూడా ఆమె స్పష్టం చేసింది.

what is myositis..?? netizens shocked to hear about samantha illness..

మొదట మాత్రం అంతా సామ్ గురించి తప్పుగా అనుకున్నారు కానీ నిజం తెలిసే సరికి ”సారీ సామ్” అంటున్నారు. గెట్ వెల్ సూన్ అని కూడా చెబుతున్నారు. మరో పక్క కొంత మంది నెటిజన్లను చూస్తే.. ఆమె ఫేస్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. కానీ కొందరు తెలియక అనవసరంగా హేళన చేసాము అని బాగా ఫీల్ అవుతున్నారు. అలానే సామ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అని.. ఆమెను విమర్శించారు.

what is myositis..?? netizens shocked to hear about samantha illness..

ప్లాస్టిక్ సర్జరీ కోసం ఏ ఆమె విదేశాలకి వెళ్లిందని కూడా అంతా అన్నారు. ఇక ఆమెకి వచ్చిన సమస్య గురించి చూస్తే.. మయోసైటిస్ సామ్ కి. మజిల్స్ కి సరైన విశ్రాంతి దొరకకపోతే వస్తుందని.. మజిల్స్ లో సమస్యలు కలుగుతాయని అంతా అంటున్నారు. అలానే ఎక్కువ డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా ఇది వస్తుందని అంతా అంటున్నారు. పైగా ఈ వ్యాధి కారణం గానే సమంత నాగ చైతన్య విడిపోయారేమో అని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ వ్యాధి గురించి సమంత కి ముందే తెలుసని ఎన్నో ఏళ్లగా ఈ వ్యాధి తో బాధ పడుతోందని కూడా అంటున్నారు.

You may also like