Urvasivo Rakshasivo Review: ఈ సినిమాతో మెగా హీరో “అల్లు శిరీష్” హిట్ కొట్టినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Urvasivo Rakshasivo Review: ఈ సినిమాతో మెగా హీరో “అల్లు శిరీష్” హిట్ కొట్టినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : ఊర్వశివో రాక్షశివో
  • నటీనటులు : అల్లు శిరీష్, అనూ ఇమాన్యుల్, వెన్నెల కిషోర్, సునీల్.
  • నిర్మాత : ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం (GA2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్)
  • దర్శకత్వం : రాకేష్ శశి
  • సంగీతం : అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్
  • విడుదల తేదీ : నవంబర్ 4, 2022

urvasivo rakshasivo movie review

Video Advertisement

స్టోరీ :

Urvasivo Rakshasivo Review: సినిమా మొత్తం ఒక ఐటీ కంపెనీలో జరుగుతూ ఉంటుంది. అందులో పనిచేసే శ్రీ (అల్లు శిరీష్) అదే కంపెనీలో పని చేసే సింధు (అనూ ఇమాన్యుల్) ని ఇష్టపడతాడు. సింధు కూడా శ్రీని ఇష్టపడుతుంది. కానీ ప్రేమించట్లేదు అని చెప్తూ ఉంటుంది. తర్వాత వారిద్దరూ ప్రేమలో పడతారు. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. వారిద్దరూ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? వారిద్దరికీ మధ్య ఉన్న అభిప్రాయభేదాలు పరిష్కారం అయ్యాయా లేదా? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

urvasivo rakshasivo movie review

Urvasivo Rakshasivo Review in Telugu రివ్యూ :

అల్లు శిరీష్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. సాధారణంగా అల్లు శిరీష్ అంటే ప్రయోగాత్మక సినిమాలు చేస్తారు అనే ఒక గుర్తింపు ఉంది. ఒక సినిమాకి ఒక సినిమాకి పోలిక లేకుండా ఉండేలాగా అల్లు శిరీష్ చూసుకుంటారు. సినిమా ఫలితంతో పనిలేకుండా కొత్తగా డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులముందుకు అల్లు శిరీష్ తీసుకొస్తుంటారు. ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న లవ్ స్టోరీ అని మనకి ట్రైలర్ చూస్తే అర్థం అయిపోతుంది. సినిమా కథ పెద్ద కొత్తది ఏమి కాకపోయినా కూడా చూపించిన విధానం డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి లవ్ స్టోరీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చి చాలా కాలం అయ్యింది.

urvasivo rakshasivo movie review

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టుగా చేశారు. గత సినిమాలతో పోలిస్తే అనూ ఇమాన్యుల్ కి నటనకి ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. కొన్నిచోట్ల సీన్స్ బోరింగ్ గా అనిపిస్తాయి. కానీ కొన్ని సీన్స్ లో కామెడీ మాత్రం నవ్వు తెప్పించే విధంగానే ఉంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కథ పరంగా కూడా చూపించిన విధానం బాగుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం టేకింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • కాన్సెప్ట్
  • కామెడీ సీన్స్
  • నిర్మాణ విలువలు
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • అక్కడక్కడా బోరింగ్ గా అనిపించే కొన్ని సీన్స్
  • సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్

రేటింగ్ :

3.25/5

ట్యాగ్ లైన్ :

చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న లవ్ స్టొరీ విడుదల అయ్యింది. కథలో కొత్తదనం ఏమీ ఆశించకుండా, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా ఒక మంచి సినిమా చూద్దాం అనుకునేవారికి ఊర్వశివో రాక్షశివో ఒక ఎంటర్టైనర్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

Also Read: ఇప్పుడు ఉన్న “యంగ్” హీరోల్లో… నెక్స్ట్ “సూపర్ స్టార్” అయ్యే టాలెంట్ ఉన్న 11 హీరోలు..! లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..?


End of Article

You may also like