Home Filmy Adda ”హరి హర వీర మల్లు” నుండి తప్పుకున్న బాలీవుడ్ స్టార్… అతని స్థానంలో ఎవరంటే..?

”హరి హర వీర మల్లు” నుండి తప్పుకున్న బాలీవుడ్ స్టార్… అతని స్థానంలో ఎవరంటే..?

by Megha Varna

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో మన ముందుకి త్వరలోనే రానున్నారు. ఈ సినిమా టీజర్ ని కూడా ఎప్పుడో విడుదల చేశారు. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇది ఒక పిరియాడిక్ సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ యుద్ధాలు చేయడం కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.

ఈ సినిమా లో ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖ నటీ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా ఎన్నో కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి బాలీవుడ్ నటుడు తప్పుకున్నారని తెలుస్తోంది. ఇక దాని కోసం చూస్తే.. అర్జున్ రాంపాల్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.

6 harihara veeramallu

బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ని హరి హర వీర మల్లు చిత్రంలో ఔరంగబేజు పాత్ర ని చెయ్యమన్నారు. అందుకు అతను కూడా ఒప్పుకున్నాడు. కానీ పవన్ బిజీగా ఉండటంతో హరి హర వీర మల్లు షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఈ కారణం వలన అర్జున్ రాంపాల్ డేట్స్ లో సమస్య వచ్చింది. అందుకే ఆయన సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. దీనితో అతని ప్లేస్ లో బాబీ డియోల్ ని పెడుతున్నారు. బాబీ డియోల్ ని ఫైనల్ చేసేస్తే.. టాలీవుడ్ లోకి ఈ హీరో ఎంట్రీ ఇచ్చేస్తారు.

You may also like