Home Filmy Adda ”అనుష్క” ఏం చేస్తోంది..? అసలు సినిమా ఉందా..?

”అనుష్క” ఏం చేస్తోంది..? అసలు సినిమా ఉందా..?

by Megha Varna

అనుష్క శెట్టి గురించి మనం ఏమి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు అనుష్క శెట్టి. ఒక రకంగా చాలా సంవత్సరాల తర్వాత అరుంధతి సినిమాతో మళ్లీ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్ మొదలు పెట్టారు.

ఆ తర్వాత ఇదే తరహాలో ఎన్నో పవర్ ఫుల్ పాత్రలు చేశారు అనుష్క. అనుష్క చివరిగా 2020 లో వచ్చిన నిశ్శబ్దం సినిమాలో నటించారు. 2005 లో ఈ ముద్దుగుమ్మ సూపర్ సినిమా తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

anushka - naveen polisetty movie story resembles the recent releases..??

ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎప్పటి నుండి వినపడుతున్నాయి. కానీ దీని మీద ఎలాంటి వార్త ఇప్పటికి కూడా లేదు. అనుష్క చాలా సినిమాల్లో నటించారు. సూపర్, సింగం, అరుంధతి, డాన్, లక్ష్యం, కేడి, ఖలేజా ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు అనుష్క. అయితే ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు మాత్రం ఎక్కడ కనపడడం లేదు.

anushka - naveen polisetty movie story resembles the recent releases..??

చిత్ర పరిశ్రమకి పూర్తిగా స్వీటీ కనుమరుగై పోయారు. ఈమె పూర్తిగా సినిమాల నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఏమో అని చాలా మంది అంటున్నారు. నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేయబోతున్నారు అని వార్త వచ్చినా ఇంకా దాని ఊసే లేదు. చలన చిత్ర పరిశ్రమ ఈమెను మరిచిపోయింది అని కూడా చాల మంది అంటున్నారు. పెళ్లి చేసుకుని ఈమె సినిమాలకి దూరంగా ఉండాలని అనుకుంటోందేమో అనుకుంటే పెళ్లి కూడా చేసుకోలేదు. మరి ఏదైనా సినిమాతో ఈమె షాక్ ఇస్తుందేమో చూడాలి.

You may also like