Home Filmy Adda సమంత “యశోద” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

సమంత “యశోద” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by Mohana Priya

సమంత హీరోయిన్ గా రాబోతున్న సినిమా యశోద. ఈ సినిమాకి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సమంత గర్భవతి పాత్రలో నటించారు. సమంత ఒక ఛాలెంజింగ్ పాత్ర పోషించారు అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ఇందులో ఉన్ని ముకుందన్ హీరోగా నటించారు.

అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, శత్రు, మురళీ శర్మ, శత్రు ఇంకా ఎంతోమంది ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్ ఇటీవల పూర్తి చేసుకుంది. సినిమా సెన్సార్ షో చూసిన సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుంది అంటూ రివ్యూ ఇచ్చారు సమాచారం. సినిమా చూసిన వారు ఇలాంటి డిఫరెంట్ కథ ఉన్న సినిమా రావడం చాలా అరుదుగా జరుగుతుంది అని అన్నారు.

samantha remuneration for yashoda

అలాగే ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ అవుతాయని అంటున్నారు. సినిమా మొదటి నుండి చివరి వరకు ఏం జరుగుతుంది అనే ఆసక్తి తో ఉంటుంది అని అంటున్నారు. అలాగే సినిమాలో ఎంచుకున్న కథనం కూడా బాగుంది అని, అది తెరపై చూపించిన విధానం ఇంకా బాగుంది అని అంటున్నారు. దీని ప్రకారం యశోద సినిమా సూపర్ హిట్ సాధించడం ఖాయం అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే సినిమా సెన్సార్ రిపోర్ట్ ఇది అని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే అంతవరకు ఆగాల్సిందే.

You may also like