Ads
ఒక సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది పరిచయం అవుతుంటారు. వారిలో నటీ నటులు అలాగే టెక్నీషియన్స్ కూడా ఉంటారు. అలాగే ఒక సంవత్సరంలో ఎంత మంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. వారిలో కొంత మంది మాత్రమే మొదటి సినిమాతో గుర్తింపు సంపాదించుకుంటారు.
Video Advertisement
అలా తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులకి బాగా ఫేమస్ అయిన నటి శ్రీలీల. పెళ్లి సందడి ఈ సినిమాతో శ్రీలీల తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
అలాగే రవి తేజ హీరోగా నటిస్తున్న ధమాకా సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ అంటూ ఇటీవల సినిమా బృందం ప్రకటించింది. ఇది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని సినిమాల్లో శ్రీలీల నటిస్తున్నారు. డీజే టిల్లు సీక్వెల్ సినిమాలో మొదట శ్రీలీల నటించాల్సి ఉంది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్నారు అనే వార్తలు వచ్చాయి.
ఇప్పుడు శ్రీలీల పారితోషికం భారీగా పెంచేశారు అనే వార్త వినిపిస్తోంది. ఒక సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు అడుగుతున్నారు అని అంటున్నారు. కొంత మంది, “ఆమె టాలెంటెడ్ నటి” అని, “అంత పారితోషకం ఇచ్చినా పర్వాలేదు” అంటే, కొంత మంది మాత్రం, “మొదటి సినిమాకి వచ్చిన పాపులారిటీతో ఇలా పారితోషకం పెంచితే అవకాశాలు రావడం కష్టం ఏమో” అని అంటున్నారు. కానీ శ్రీలీల మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
End of Article