Home Filmy Adda “యశోద” షూటింగ్‌లో “సమంత” అలా ఏడ్చేది అంట… డైరెక్టర్స్ ఏమన్నారంటే?

“యశోద” షూటింగ్‌లో “సమంత” అలా ఏడ్చేది అంట… డైరెక్టర్స్ ఏమన్నారంటే?

by Mohana Priya

చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత సమంత హీరోయిన్ గా నటించిన యశోద సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది. సమంతని తెలుగు తెరపై చూసి చాలా కాలం అయ్యింది. విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి తమిళ్ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కానీ డైరెక్ట్ తెలుగు సినిమా చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. దాంతో యశోద సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది సెంటిమెంట్ తో పాటు యాక్షన్ కూడా ఉన్న సినిమా అని అర్థం అవుతుంది. సినిమాలో స్టార్టింగ్ లో మొత్తం అసలు ఏం జరుగుతోంది అని అర్థం కాకుండా నడుస్తుంది.

samantha post about yashoda release..

కానీ ఒక్కసారి ట్విస్ట్ ప్రేక్షకులకు తెలిసిపోయాక సినిమా మొత్తం చాలా రొటీన్ కథగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందో ప్రేక్షకులు ఊహించగలుగుతారు. పర్ఫామెన్స్ విషయానికి వస్తే సమంత సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించారు. ఫ్యామిలీ మాన్ సిరీస్ తో సమంత యాక్షన్ సీన్స్ కూడా చేయగలరు అని నిరూపించారు. ఈ సినిమాలో కూడా అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ చేశారు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించారు.

samantha remuniration for yashoda
అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకులు హరి-హరీష్ మీడియాతో మాట్లాడారు. “సమంతతో పని చేయడం ఎలా ఉంది?” అని అడిగిన ప్రశ్నకు, “సమంత చాలా హార్డ్ వర్కింగ్” అని, “ఎమోషనల్ సీన్స్ లో నటించాల్సి వచ్చినప్పుడు అసలు గ్లిజరిన్ కూడా వాడరు” అని, “దర్శకులు ఎలాంటి నటన కోరుకుంటారో అలాగే నటిస్తారు” అని అన్నారు. అలాగే తన హెల్త్ కండిషన్ గురించి అసలు ఏమీ చెప్పలేదు అని, “మీకు ఓకేనా? లేదా ఇంకొక టేక్ చేద్దామా?” అని అడిగేవారు అని అన్నారు. ఇది కేవలం పాన్-ఇండియన్ సినిమా మాత్రమే కాదు అని పాన్-యూనివర్సల్ గా కూడా చాలా కొత్త కాన్సెప్ట్ సినిమా అని దర్శకుడు అన్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథని రాసుకొని డెవలప్ చేసాం అని చెప్పారు.

watch video :

You may also like