Home Filmy Adda సమంత “యశోద” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?

సమంత “యశోద” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?

by Mohana Priya

సమంత హీరోయిన్ గా నటించిన యశోద సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఈ సినిమాకి తెలుగులో అయితే చాలా మంచి టాక్ వస్తోంది. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు.

సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా రూపొందింది. మొదటి వరకు సినిమా బాగా నే నడిచినా కూడా ఒకసారి ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత ప్రేక్షకులకు ఈ సినిమా మీద కొంచెం తగ్గుతుంది. కానీ ఈ సినిమాలో సమంత మాత్రం చాలా బాగా నటించారు అని అందరూ అన్నారు. అయితే ఈ సినిమాలో కొన్ని విషయాలు మైనస్ కూడా అయ్యాయి అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

samantha post about yashoda release..

#1 సినిమాలో చెప్పాలి అనుకున్న పాయింట్ బాగుంది. కానీ సినిమా ముందుకు వెళ్లే కొద్దీ ప్రేక్షకులకి ఆ తర్వాత సీన్ ఏమవుతుంది అనేది అర్థం అవుతూ ఉంటుంది. ఈ విషయంపై మాత్రం కొంత మంది సినిమాలో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంది అంటున్నారు. మరికొంత మంది అయితే ఏకంగా పోకిరి సినిమాతో పోలుస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం, “ఇందులో ఏముంది? మనం అంతకు ముందు చాలా సినిమాల్లో చూసాం” అని అంటున్నారు.

samantha remuneration for yashoda

#2 సినిమాలో డైలాగ్స్ విషయంలో కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కొన్నిచోట్ల ముఖ్య పాత్రలు చెప్పే డైలాగ్స్ అర్థం కావు. సడన్ గా డైలాగ్స్ లో సౌండ్ తగ్గిపోవడం వంటివి జరిగింది. దాంతో కొన్ని డైలాగ్స్ స్పష్టంగా అర్థం కూడా కాలేదు అని అంటున్నారు.

minus points in samantha yashoda movie

#3 సినిమాలో కొన్ని సీన్స్ కూడా లాజిక్ లేకుండా ఉన్నాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎమోషన్స్ నిజమైనవి అనిపించలేదు. సినిమాటిక్ లిబర్టీతో ఎమోషన్స్ ఇంకా ఎక్కువగా చూపించడానికి ప్రయత్నించారు కానీ అవి చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. దాంతో నాచురల్ గా ఉంటే ఇంకా బాగుండేది అని అంటున్నారు. కొన్ని సీన్స్ అనవసరంగా పెట్టారు ఏమో అనిపిస్తుంది. అందులో ముఖ్యమైనది ఫైటింగ్ సీన్. అసలు ఆ సీన్ లేకపోయినా కూడా సినిమాలో పెద్దగా తేడా ఏమీ ఉండదు ఏమో అనిపిస్తుంది.

will these become plus or minus to samantha yashoda movie

#4 ఈ సినిమాని పాన్-ఇండియన్ సినిమాగా విడుదల చేశారు. ఈ మధ్య వచ్చే చాలా సినిమాలని ఇలాగే విడుదల చేస్తున్నారు. కానీ అందులో అన్నీ మాత్రం భారతదేశవ్యాప్తంగా హిట్ అవ్వట్లేదు. సినిమా కథ బాగుంది. స్టోరీ లైన్ కూడా బాగుంది. కానీ పాన్-ఇండియన్ రేంజ్ సినిమా అయితే కాదేమో అనిపిస్తుంది. సాధారణంగా పాన్-ఇండియన్ సినిమాలు అంటే కంటెంట్ విషయంలో కూడా చాలా చాలా గొప్పగా ఉండాలి అని అనుకుంటారు. అంత బలమైన కంటెంట్ ఉన్న సినిమా అయితే కాదేమో అని చాలా మంది అంటున్నారు.

minus points in samantha yashoda movie

#5 సినిమా సెకండ్ హాఫ్ అయితే అసలు లాజిక్ లేకుండా అనిపిస్తుంది అని అంటున్నారు. అందులోనూ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలాగానే ఉంది. ఆ గ్రాఫిక్స్ కూడా గ్రాఫిక్స్ అని తెలిసిపోయేలాగానే ఉన్నాయి. సింపుల్ గా అయిపోయే క్లైమాక్స్ పోర్షన్ చాలా సాగదీశారు అన్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ అక్కడ కొత్తగా చూపించడానికి ఏమీ లేదు. కానీ ఎందుకు ఇంకా క్లైమాక్స్ అంత ల్యాగ్ చేశారు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

minus points in samantha yashoda movie

ప్రస్తుతం అయితే యశోద సినిమా థియేటర్లో నడుస్తుంది. కొంత మంది చాలా బాగుంది అంటూ ఉంటే, కొంత మంది మాత్రం ఒక్క సారి చూడొచ్చు అంటున్నారు. కొంత మంది మాత్రం ఇది కేవలం సమంత సినిమా మాత్రమే, ఈ సినిమా మొత్తాన్ని సమంత నడిపించారు అని అంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉందో డిసైడ్ చేయాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

You may also like