Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో విషాదాలు వరుసగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పేరు ప్రఖ్యాతులు పొందిన కృష్ణంరాజు మరణించారు. కృష్ణ మొదటి భార్య అయిన ఇందిరాదేవి కూడా కన్నుమూశారు.
Video Advertisement
ఘట్టమనేని కుటుంబం విషయానికి వస్తే ఇందిరా దేవి ఇప్పుడు మరణించారు. దానికి ముందు కృష్ణ రెండవ భార్య విజయనిర్మల కూడా మృతి చెందారు. అలానే చిన్న వయసులోనే రమేష్ బాబు కూడా మరణించారు.
ఇలా ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం కూడా ఏమి బాలేదట. సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యం పాలయ్యారు. టాలీవుడ్ సీనియర్ నటుల్లో కృష్ణ కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు పొందారు కృష్ణ. కానీ ఈయన ఆరోగ్యం ఇప్పుడేమి బాలేదు. కృష్ణ అనారోగ్యం పాలయ్యారు.
అందుకు ఆయన్ని హైదరాబాద్ లో కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఇక ఆయనకి ఏమైంది అనేది చూస్తే.. శ్వాస సంబంధిత వ్యాధి తో కృష్ణ బాధ పడుతున్నారు అని తెలుస్తోంది. కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేసిన తరవాత అక్కడ డాక్టర్లు చికిత్స చేస్తున్నారు అని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. కృష్ణ వయస్సు 80 సంవత్సరాలు. అందుకే కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. అభిమానులు కూడా కృష్ణ ఆరోగ్య మేరకు ఆందోళన పడుతున్నారు.
End of Article