Home Filmy Adda OTT లో స్ట్రీమ్ అవ్వనున్న హన్సిక పెళ్లి..? ఇంతకీ ఎక్కడ జరగబోతోంది అంటే..?

OTT లో స్ట్రీమ్ అవ్వనున్న హన్సిక పెళ్లి..? ఇంతకీ ఎక్కడ జరగబోతోంది అంటే..?

by Megha Varna

డిసెంబరులో సీనియర్ హీరోయిన్ హన్సిక వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సోహాల్‌ కతూరియాతో ఈమె వివాహం నిశ్చయం అయ్యింది. సోహాల్‌ కతూరియా ఒక బిజినెస్ మ్యాన్. అవంతే టెక్స్ వరల్డ్ అనే టెక్స్టైల్ కంపెనీ కి సోహైల్ యజమాని. కాగా హన్సిక కాబోయే భర్త బిజినెస్ స్ట్రాటజీస్లో మంచి గ్రిప్ ఉన్న మనిషి అని.. వ్యాపారంలో నెంబర్ వన్ మైండ్ సెట్ ఉన్న బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది.

ప్రేమ లో వున్న వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించడం జరిగింది. ‘ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్‌’లో వీళ్ళ వివాహం జరగనుంది.

heroine hansika revealed her fiance photos..

వీళ్ళ వివాహం కి సినిమా సెలెబ్రిటీలతో పాటు కొంత మంది అతిథుల్ని మాత్రమే ఆహ్వానించారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ప్రేమికులు మూడు ముళ్ళు వేసుకోవడం మంచి విషయం. వీళ్ళ వివాహ వేదిక ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్‌ కి గొప్ప చరిత్ర వుంది. 450 ఏళ్ల చరిత్ర ఉందిట. డిసెంబరు 2న అక్కడకి వస్తారట. సూఫీ ఉంటుంది ఆరోజు. తరవాత మెహందీ, సంగీత్ ఉంటాయి. డిసెంబరు 4న వివాహంని ఓటీటీలో ల్రైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ సంస్థ ఒప్పందాన్ని కూర్చుకున్నట్టు తెలుస్తోంది.

hansika attended her fiance first marriage

ఇదిలా ఉంటే సోహాల్‌ కతూరియాకి ఇది వరకే పెళ్లి అయ్యిందట. 2016 లో రింకీ బజాజ్‌తో పెళ్లి జరిగినదిట. పైగా హన్సికకి రింకీ బజాజ్‌ ఫ్రెండ్ కూడా. అభిప్రాయ భేదాలతో సోహాల్‌ కతూరియా రింకీ బజాజ్‌ విడిపోయారు. సోహాల్‌ కతూరియాతో కలిసి హన్సిక బిజినెస్ చేస్తున్నప్పుడు లవ్ లో పడిందట. వీళ్లిద్దరికీ ఎనిమిదేళ్ల నుండి పరిచయం ఉందిట.

You may also like