Home Filmy Adda ”సూపర్ స్టార్ కృష్ణ” గారు సినిమాల కోసం ఇంతలా కష్టపడేవారని మీకు తెలుసా..?

”సూపర్ స్టార్ కృష్ణ” గారు సినిమాల కోసం ఇంతలా కష్టపడేవారని మీకు తెలుసా..?

by Megha Varna

సూపర్ స్టార్ కృష్ణ గారు తీవ్ర అనారోగ్యం తో ఆర్గాన్ ఫెయిల్యూర్ తో గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పటల్ కి కుటుంబ సభ్యులు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయన ఇవాళ ఉదయం 4 గంటలకి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఈ వార్తతో సినీ అభిమానులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఇదే ఏడాది కాలేయ సంబంధిత సమస్యతో మరణించిన సంగతి తెలిసిందే.

famous personalities died in 2022

అంతే కాదు కృష్ణ గారి మొదటి భార్య ఇందిరా దేవి గారు కూడా రెండు నెలల క్రితం మరణించారు. ఒకవైపు పెద్ద కొడుకు, మరో వైపు భార్య ని ఒకే ఏడాదిలో కోల్పోయిన కృష్ణ గారు మానసికంగా మరింత క్షీణించారని అంటున్నారు. సంవత్సరం వ్యవధి లో నాన్న, అమ్మ, అన్న గారిని కోల్పోయారు మహేష్ బాబు.

what happened to super star krishna..??

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా కష్ట పడేవారట. రోజు కి మూడు షిఫ్టులు కూడా ఈయన పని చేసేవారట. రోజుకి సుమారు పదిహేను గంటల పాటు ఆయన కష్ట పడేవారట. ఒక రోజు బాగా అలసిపోవడంతో దర్శకుడిని గంట సేపు నిద్రపోతానని అడిగారట. దానికి జవాబుగా దర్శకుడు విగ్ వేసుకుని నిద్రపొమ్మని అన్నారట. ఎందుకు అని కృష్ణ అడిగితే నిద్రపోతున్నట్టు తీసే షాట్స్ వున్నాయి వాటిని తీస్తాం అని అన్నారట. ఇలా ఆయన రోజుకి సుమారు పదిహేను గంటల పాటు కష్ట పడేవారట.

You may also like