హీరోయిన్ గా చేసిన ”ప్రేమ”… ఉన్నట్టుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎందుకు మారాల్సి వచ్చింది..? కారణం అదేనా..?

హీరోయిన్ గా చేసిన ”ప్రేమ”… ఉన్నట్టుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎందుకు మారాల్సి వచ్చింది..? కారణం అదేనా..?

by Megha Varna

Ads

నటి ప్రేమ అందరికీ సుపరిచితమే. ఈమె గురించి కొత్తగా మనం ఏమి పరిచయం చెయ్యాల్సిన పని లేదు. ఈ కన్నడ భామ కన్నడ సినిమాలతో పాటుగా తెలుగు సినిమాలను కూడా చేసింది. చాలా మంది టాప్ హీరోల సరసన ఈ ముద్దుగుమ్మ నటించింది. ఈమె నటించిన కన్నడ చిత్రాలతో పాపులారిటీ ని తెచ్చుకుంది.

Video Advertisement

ధర్మచక్రం సినిమా తో ఈమె తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. విక్టరీ వెంకటేష్ ఈ సినిమా లో హీరో. మొదటి సినిమా తోనే ఈమె తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యిపోయింది.

అలానే ఈమె దేవి చిత్రంలో కూడా నటించింది. దేవి సినిమాలో ఈ పాత్ర చాలా బాగుంటుంది. కానీ నెక్స్ట్ అన్నీ కూడా ప్లాప్ అయ్యాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈమె పలు సినిమాలు చేసింది. జానకి వెడ్స్ శ్రీరామ్, ఢీ వంటి చిత్రాలను చేసింది కానీ ఆ తరవాత అవకాశాలు రాలేదు. మధ్యలో కొన్నాళ్లు బ్రేక్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ఈమె స్టార్ట్ చేసింది. రాజేంద్ర ప్రసాద్ అనుకోని ప్రయాణం లో ఈమె నటించింది.

హీరోయిన్ అయ్యి ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది అనేది చాలా మందికి వచ్చిన ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం అలీ షోలో చెప్పింది. చిరునవ్వుతో సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషిందట. ఆ పాత్ర కి పేరు బాగా వచ్చిందట. ఆ సినిమా చేసాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు రావడంతో ఈమె బిజీ అయిపోయాను అని అంది.


End of Article

You may also like