Ads
చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యింది. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథ పరంగా, నటన పరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు.
Video Advertisement
దాని తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్.
కానీ తెలుగులో చాలా మార్పులు చేశారు. ప్రేక్షకులు నిరాశ పడకుండా ఉండేలాగా ఎలివేషన్స్, డైలాగ్స్ బలంగా ఉండేలా చూశారు. ఏది ఏమైనా ఈ సినిమాకు నష్టమే కలిగింది. అయితే ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ లోని వున్నప్పుడే మోహన్ రాజా నాగార్జున అఖిల్ కలిసి మల్టీ స్టారర్ సినిమా ని చేయబోతున్నారని చెప్పారు. అయితే ఆ సినిమా ప్రాజెక్ట్ ని కూడా ఇది వరకే ఫైనల్ చేసేసారు.
గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ టైం లో మోహన్ రాజా నాగార్జున అఖిల్ కలిసి మల్టీ స్టారర్ సినిమా గురించి చెప్పారు. పైగా ‘తని ఒరువన్ 2’కి ముందే ఈ సినిమాని తీసుకు వస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదని టాక్ నడుస్తోంది. దీనికి కారణం గాడ్ ఫాదర్ సినిమా ఏ. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఈ సినిమాకు రావక పోవడమే ఇందుకు కారణం. నాగార్జున ఈ సినిమా చెయ్యాలా వద్దా అని ఆలోచన లో పడ్డాడట.
End of Article